దాసరికి తిక్క రేగింది !!  

Dasari Narayana Rao Fires On Film Industry

11:47 AM ON 29th February, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao Fires On Film Industry

సినీ పరిశ్రమలో చోటుచేసుకునే పరిణామాల పై తన గళం వినిపించే దర్శక రత్న డాక్టర్ దాసరి నారాయణ రావు మరోసారి సినీ పరిశ్రమ తీరుపై చురకలు వేసారు. గుంటూరు జిల్లా తెనాలిలో అభ్యుదయ సినీ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ స్మారక పురస్కారాన్ని దర్శకరత్న దాసరి నారాయణరావు అందుకున్నారు. ప్రముఖ సంపాదకులు కె. రామచంద్రమూర్తి తదితరులు ప్రసంగించారు. ఈ సందర్భంగా డాక్టర్ దాసరి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో నెలకొన్న పరిణామాల పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. " హీరోకు అడ్వాన్స్‌లు ఇచ్చి సినిమా తీసేందుకు చుట్టూ తిరగాల్సి వస్తోంది. హీరో ఒప్పుకుంటే చాలు మిగతా వాటితో పని లేదన్నట్లుగా నేటి సినిమా పరిస్థితి తయారైందని కథ సంగతి పక్కన పెట్టి నేటి సినిమా హీరో చుట్టూ తిరుగుతోంది. ఆర్టిస్టుల నోటికి వచ్చిన మాటలే డైలాగులుగా వచ్చే పరిస్థితి పట్ల సిగ్గు పడుతున్నారు. పంచ్‌ డైలాగులు కాదు మంచి డైలాగులు కావాలి. బొల్లిముంత డైలాగులు నేటి రాజకీయనాయకులు చూస్తే వాళ్లకు ఎక్కడ గుచ్చుకుంటాయో, పొడుచుకుంటాయో తెలియదు.

English summary

Dasari Narayana Rao Controversial Comments on Film Industry. He has been expressing his displeasure on various aspects related to Film Industry.