దాసరి తొలి రంగుల చిత్రం ఇదే!

Dasari Narayana Rao first telugu color film

06:37 PM ON 22nd July, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao first telugu color film

దర్శకరత్న దాసరి నారాయణరావు తొలి రంగుల చిత్రం 'బలి పీఠం'. దాసరి నారాయణరావు దర్శకత్వంలో శోభన్ బాబు కూడా తొలిసారి నటించిన సినిమా కూడా ఇదే.. అప్పటి నుండి 40ఏళ్ళ పాటు 'బావా బావా' అని అనుకుంటూ కొనసాగిన అనుబంధం వీరిది. 'బలి పీఠం' చిత్రం 1975లో విడుదలై శతదినోత్సవం జరుపుకుంది. వారం రోజుల పాటు కేవలం మహిళల కోసం ప్రత్యేకంగా ప్రదర్శించబడ్డ చిత్రం కూడా ఇదే. ఊర్వశి శారద.. శోభన్ బాబుతో పోటా పోటీగా నటించి శభాష్ అనిపించుకుని మంచి పాటలతో విజయవంతమై, దాసరికి ఘన విజయం తెచ్చిపెట్టింది ఈ సినిమా. రాజబాబు, కైకాల సత్యనారాయణ, మురళీ మోహన్, నిర్మలమ్మ, రోజా రమణి వంటి గొప్ప గొప్ప నటులు ఈ చిత్రంలో నటించారు.

'సంగీత చక్రవర్తి' కె. చక్రవర్తి ఈ చిత్రానికి సంగీతం అందించారు. రంగనాయకమ్మ రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం అప్పట్లో అద్భుత విజయం సాధించింది. ఈ చిత్రానికి బత్తిన శ్యామ్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరించారు.

English summary

Dasari Narayana Rao first telugu color film