ఊపిరికి దాసరి కితాబు

Dasari Narayana Rao Praises Oopiri Movie

11:03 AM ON 5th April, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao Praises Oopiri Movie

బొమ్మరిల్లు’ తరువాత తనకు నచ్చిన చిత్రం ‘వూపిరి’ అంటూ ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు నాగ్ టీం పై ప్రశంసలు కురిపించారు. ‘వూపిరి’ చిత్రాన్ని వీక్షించి, ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని ఫేస్‌బుక్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. చిత్రం విజయం సాధించినందుకు దర్శకుడు వంశీ పైడిపల్లికి శుభాకాంక్షలు తెలిపారు. ‘బొమ్మరిల్లు’ తరువాత తాను ఇష్టపడ్డ, ఆస్వాదించిన చిత్రమిదని పేర్కొన్నారు. నటుడు కళ్ళతో కూడా నటించగలడని నాగార్జున నిరూపించారని, అది చాలా కష్టమని అన్నారు. కార్తీ చాలా చక్కగా నటించారని తెలిపారు. మొత్తం చిత్ర బృందాన్ని అభినందిస్తూ... వంశీ పైడిపల్లితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్‌ చేశారు. ఈ చిత్రంలో నాగార్జున కుర్చీకి పరిమితమైన వ్యక్తి పాత్రలో నటించారు.

ఇవి కుడా చదవండి:

నన్ను సీఎం లైంగికంగా వాడుకున్నారు

పవన్ పిలిస్తే వెళ్ళేది లేదన్న రోజా

విడుదలకు ముందే బాహుబలి రికార్డు బ్రేక్

Watched #Oopiri…. My best wishes to Director Vamshi Paidipally on grand success of the movie. This was the movie which I...

Posted by Dasari Narayana Rao on Monday, April 4, 2016

English summary

Tollywood Legend Dasari Narayana Rao Praises Oopiri movie and Appreciated Director Vamsi Paidipalli ,Hero Nagarjuna and Producer PVP . He says that After Bommarillu movie he liked this movie very much.