బాహుబలి కంటే పెళ్లి చూపులకే ఓటేస్తానన్న దాసరి

Dasari Narayana Rao Praises PelliChupulu Movie

11:21 AM ON 3rd August, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao Praises PelliChupulu Movie

డి.సురేశ్ బాబు సమర్పణలో ధర్మపథ క్రియేషన్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై రాజ్ కందుకూరి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించిన "పెళ్లిచూపులు" చిత్రం ఇటీవల విడుదలై మాంచి టాక్ తెచ్చుకుంది. విజయ్ దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రంతో తరుణ్ భాస్కర్ దర్శకునిగా పరిచయమయ్యాడు. ఇక రామానాయుడు స్టూడియోస్ లో ఏర్పాటుచేసిన విజయోత్సవ సభకు దాసరి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇవాళ మంచి సినిమా ఏదంటే పెళ్లిచూపులు అని చెప్తా. నన్నెవరైనా బాహుబలి, పెళ్లిచూపులు సినిమాల్లో దేనికి ఓటేస్తారనడిగితే పెళ్లిచూపులు కు ఓటేస్తా అని దర్శక రత్న దాసరి నారాయణరావు ప్రకటించారు.

తన స్పీచ్ కొనసాగిస్తూ, 'స్కిన్ షో, వల్గారిటీ, మాస్ మసాలాలు లేని నిజాయితీ ఉన్న సినిమా ఇది. మనకు కావాల్సింది రికార్డులు తిరగరాసే సినిమాలు కాదు, చరిత్రలో నిలిచిపోయే సినిమాలు. కలెక్షన్ల కోసం మనం బాధపడటం లేదు. మంచి సినిమా కోసం బాధపడుతున్నాం. ఇది జీవితానికి దగ్గరగా ఉన్న మంచి సినిమా. నిజ జీవితంలో మనకు రోజూ తారసపడే పాత్రలతో తరుణ్ భాస్కర్ వండర్ ఫుల్ సినిమా తీశాడు. ఇందులో హీరోయిన్ కు ఆమె చేసిన క్యారెక్టరే గ్లామర్ తెచ్చింది. హీరో బాగా చేశాడు. ఇలాంటివి పది సినిమాలొస్తే ఇండియాలోనే తెలుగు చిత్రసీమ నెంబర్ వన్ అవుతుంది అన్నారు. నిర్మాత దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ, సురేశ్ బాబు, నిర్మాతలు రాజ్, యష్, హీరోయిన్ రీతూవర్మ, నటులు నందు, ప్రియదర్శి, సంగీత దర్శకుడు వివేక్ సాగర్ , సౌండ్ ఇంజనీర్ సంజయ్ , ఛాయాగ్రాహకుడు నగేశ్, ఎడిటర్ రవితేజ, మధుర ఎంటర్ టైనమెంట్స్ అధినేత శ్రీధర్ రెడ్డి తదితరులు మాట్లాడారు.

ఇవి కూడా చదవండి:అమెరికా అబ్బాయి-తెలంగాణ అమ్మాయికి ముహూర్తం ఖరారు

ఇవి కూడా చదవండి:సినిమాల కోసం మొగుడ్ని వదిలేసింది

English summary

Tollywood Senior Director and Producer Dasari Narayana Rao praises latest Super hit film "Pelli Chupulu". Dasari Narayana Rao says that good movie will get always a good response from the people and he says that he will choose Pelli Chupulu movie instead of Bahubali Movie.