వర్మకు దాసరి కితాబు

Dasari Narayana Rao Praises Ramgopal Varma

07:00 PM ON 8th January, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao Praises Ramgopal Varma

కిల్లింగ్‌ వీరప్పన్‌ చిత్రం బాగుందని దర్శకరత్న దాసరి నారాయణరావు మెచ్చుకున్నారు . ఆ చిత్ర దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం డాక్టర్ దాసరిని కలిశారు. ఈ విషయాన్ని డాక్టర్ దాసరి తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలుపుతూ ఫొటోలను పోస్ట్‌ చేశారు. కిల్లింగ్‌ వీరప్పన్‌ దర్శకుడు వర్మ తనను కలిసినట్లు పేర్కొంటూ , ఈ నెల 7న విడుదలైన చిత్రాన్ని తానూ వీక్షించినట్లు డాక్టర్ దాసరి తెలిపారు. స్మగ్లర్‌ వీరప్పన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రామ్‌గోపాల్‌ వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఏది ఏమైనా డాక్టర్ దాసరిని వర్మ కలవడం విశేషమే.

దాసరి - వర్మ మీటింగ్ ఎక్స్ క్లూజివ్ గా మీ కోసం

English summary

Dasari narayana rao praises sensational director Ram Gopal Varma.He praises Varma's new movie Killing Veerappan.