ఇది అందరి దౌర్భాగ్యం..దర్శకరత్న షాకింగ్ కామెంట్స్

Dasari Narayana Rao Shocking Comments On Padma Awards

10:27 AM ON 13th June, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao Shocking Comments On Padma Awards

సినీ పరిశ్రమలో ఏ అంశం అయినా సరే కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణ రావు తాజాగా సినీ తారలకు ఇచ్చే అవార్డుల పై షాకింగ్ కామెంట్స్ చేసారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ( మా ) ఆధ్వర్యాన సీనియర్ నటులు కైకాల సత్యనారాయణ, జమునలను సన్మానించారు. మా అధ్యక్షుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు నిర్వహించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ దాసరి పాల్గొన్నారు. "ఈ ప్రభుత్వాలు కళాకారుల ప్రతిభను గుర్తించడం లేదు.. రికమెండేషన్లు ఉంటేనే పద్మశ్రీ వంటి అవార్డులను ఇస్తున్నారు" అని ఆయన వ్యాఖ్యానించారు. నిజమైన ఆర్టిస్టులకు అవార్డులు లభించడం లేదన్నారు. 'ఎవరో ముక్కు, మొహం తెలీని వారికి పద్మశ్రీ లు ఇస్తున్నారు. అందువల్ల వాటి విలువ పడిపోయింది. ఇప్పుడు ఇచ్చినా వాటికి విలువే లేదు' అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంజలీదేవి, సావిత్రి, ఎస్వీఆర్ , జమున , కైకాల వంటి సీనియర్ నటీనటుల కు పద్మశ్రీ లు లేవంటే.. అది అందరి దౌర్భాగ్యమని ఆయన వ్యాఖ్యానించారు. ఆర్థికంగా చితికిపోయిన కళాకారులను ఆదుకోవలసిన అవసరం ఉందని, నష్టపోతున్న నిర్మాతల సాయం కోసం 14 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు.

ఇవి కూడా చదవండి:చారిటీ ఫంక్షన్ కి షర్టు విప్పేసి వెళ్ళిన ఇలియానా!

ఇవి కూడా చదవండి:ఫస్ట్ టైం ఆ అవార్డ్స్ ఫంక్షన్ కోసం చిరు డాన్సు చేస్తాడట!

English summary

Tollywood Senior Director and producer, Director and actor Dasari Narayana Rao was made some Controversial comments on Padma Awards and he said that there was no value for Padma Awards.