'సర్దార్' చిత్రం పై దాసరి షాకింగ్ కామెంట్స్

Dasari Narayana Rao shocking comments on Sardar Gabbar Singh movie

04:28 PM ON 20th April, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao shocking comments on Sardar Gabbar Singh movie

వైవిధ్యమైన దర్శకుడు మరియు నటుడు దర్శకరత్న శ్రీ దాసరి నారాయణ రావు తాజాగా పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. శ్రీకాంత్ తాజా చిత్రం 'మెంటల్ పోలీస్' ట్రైలర్ లాంచ్ కి ముఖ్య అతిధి గా విచ్చేసిన దాసరి సర్దార్ చిత్రం పై మతి పోయే కామెంట్స్ చేసాడు. అవేంటో అతని మాటల్లోనే విందాం... ఈ రోజుల్లో ఎవరూ కధని ముఖ్యంగా తీసుకోవడంలేదు. కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీస్తున్నారు తప్ప కధలో కంటెంట్ ఉండడం లేదు. కోట్లు ఖర్చు పెట్టి భారీ భారీ సెట్లు, విదేశాల్లో పాటలు చిత్రీకరణలు, విజువల్ ఎఫెక్ట్స్, ప్రమోషన్స్ చేస్తున్నారు తప్ప, కధని పట్టించుకోవడం లేదు. దీనితో అంత ఖర్చు పెట్టి తీసిన చిత్రం కూడా ఫ్లాప్ అయి కూర్చుంటుంది.

ఇటీవల కాలంలో ఎక్కువ మొత్తం పెట్టి తీసి కూడా ఫ్లాప్ గా నిలిచిన చిత్రం ఏమైనా ఉందా అంటే అది 'సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రం మాత్రమే అని దాసరి అన్నారు. కాబట్టి దర్శక-నిర్మాతలు సినిమా కి ఎంత ఖర్చు పెడుతున్నాం అని ఆలోచించకుండా కధలో ఎంత పస ఉందనేది ఆలోచిస్తే మన తెలుగు సినిమా ఖ్యాతిని పెంచుకోవచ్చని దాసరి హిత బోధ చేసారు.

English summary

Dasari Narayana Rao shocking comments on Sardar Gabbar Singh movie. Darshakaratna Sri Dasari Narayana Rao shocking and controversial comments on Sardar Gabbar Singh movie.