పిల్లలతో వస్తే తొలి ఆట ఫ్రీగా చూపించాలట

Dasari Narayana Rao Suggestion To Eluka Majaka Movie Producers

09:55 AM ON 25th February, 2016 By Mirchi Vilas

Dasari Narayana Rao Suggestion To Eluka Majaka Movie Producers

రేలంగి నరసింహారావు దర్శకత్వంలో నా ఫ్రెండ్స్‌ ఆర్ట్‌ మూవీస్‌ పతాకంపై మారెళ్ళ నరసింహారావు, వడ్డెంపూడి శ్రీనివాసరావు నిర్మించిన ‘ఎలుకా మజాకా’ చిత్రం శుక్రవారం విడుదల అవుతోంది. బ్రహ్మానందం, వెన్నెల కిశోర్‌, పావని కీలక పాత్రధారులుగా వున్న ఈ చిత్రంలో 1222 గ్రాపిక్స్‌ షాట్స్‌ ఉన్నాయట. మొత్తం ఈ చిత్రంలో 40 నిమిషాల గ్రాఫిక్స్‌ ఉంటుందట. మూడు పాటలున్నాయి. సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్.

ఈ చిత్రం విడుదల నేపధ్యంలో చిత్రయూనిట్‌తో కలిసి దర్శకరత్న డాక్టర్ దాసరి నారాయణరావు హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. ‘‘విఘ్నేశ్వరుడి వాహనమైన ఎలుక ఒకతని పై అలుగుతుంది. ఆ అలకతో అతన్ని ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిందనేది కీలకం. ఈ సినిమాలో ఎలుక హీరో. అయితే మొదటి ఆటకు పిల్లలతో వచ్చిన వారికి ఫ్రీగా చూపించమని నిర్మాతలకు సలహా ఇస్తున్నా’’ అని అన్నారు. ‘‘ఇటీవల తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాసయాదవ్‌, తుమ్మల నాగేశ్వరరావుతో జరిగిన మీటింగ్‌లో చిన్న సినిమాల గురించి మాట్లాడాను. ఐదో ఆటగా మధ్యాహ్నం ఒంటిగంటకు చిన్న సినిమాలను ప్రదర్శించడానికి అనుమతి ఇవ్వాలని అడిగాను. చిన్న సినిమాలకు నూన్ షో ఇవ్వడం వల్ల చాలా సినిమాలకు మంచి చేయొచ్చని చెప్పాను’ అని డాక్టర్ దాసరి చెప్పారు. ఇక ఈ సినిమా పెద్ద హిట్‌ కావాలని కోడి రామకృష్ణ ఆకాంక్షించారు.

English summary

Darshaka Ratna Dasari Narayana Rao was participated in "Eluka Majaka" movie press meet.He suggested producers of that movie that to play free show on first day who will bring their children to movie.Brahmanandam and Vennela Kishore were actedin Lead roles in this movie.