పవన్ కోసం 'వీరమ్' సిద్దం చేస్తున్న దర్శకరత్న     

Dasari To Remake Veeram With Pawan Kalyan

01:08 PM ON 4th February, 2016 By Mirchi Vilas

Dasari To Remake Veeram With Pawan Kalyan

ఒక్కో కాంబినేషన్ పేరు చెప్పినా , ఒక్కక్కరి కలయిక గురించి మాట్లాడినా వచ్చే రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. దానికుండే కిక్కు వేరు. ఇంతకీ దర్శక రత్న దాసరి నారాయణరావు నిర్మాతగా పవన్‌ కల్యాణ్‌ చిత్రం వస్తోందని ఆ మధ్య టాక్ నడిచింది. ఈ కాంబినేషన్ అంటే ఓ క్రేజ్... అరుదైన కలయికలో ఓ సినిమా వస్తోందంటూ చిత్రసీమ ఆసక్తిగా ఎదురుచూసింది. అయితే అప్పటి నుంచి పవన్‌ కోసం డాక్టర్ దాసరి కథలు వింటూనే ఉన్నా ఓ కిలిక్కి మాత్రం రాలేదని ఫిల్మ్‌నగర్‌ వార్త. పవర్ స్టార్ రేంజ్ కి దర్శక రత్న తోడవ్వడంతో అందుకు తగ్గట్టుగా సినిమా వుండాలి కదా మరి. అందుకే ఇంతవరకూ ఒక్క కథ కూడా దాసరి అంచనాలకు దగ్గరగా రాలేదని అంటున్నారు. ఇక లాభం లేదని భావించిన డాక్టర్ దాసరి ఇప్పుడు రీమేక్‌ చిత్రాలపై దృష్టి పెట్టారట. ఇప్పటికే తమిళంలో అజిత్‌ నటించిన ‘వీరమ్‌’ హక్కుల్ని పవన్‌ కోసం కొనుగోలు చేస్తే ఎలా ఉంటుందోనని డాక్టర్ దాసరి కసరత్తు ప్రారంభించారట. త్వరలోనే ‘వీరమ్‌’ని పవన్‌ కోసం ప్రదర్శించి, పవన్‌ నిర్ణయం మేరకే . ‘వీరమ్‌’ రీమేక్‌పై దృష్టి సారించాలని డాక్టర్ దాసరి అనుకుంటున్నట్లు ఇండస్ట్రీ లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఒకవేళ ‘వీరమ్‌’కి పవన్‌ ఓకే చెప్పేస్తే, ఈ చిత్రానికి దర్శకుడు ఎవరనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే నృత్య దర్శకుడు జానీ మాస్టర్‌ ఈ కొత్త సినిమాకు దర్శకత్వ బాధతలు చేపట్టగలడని కూడా టాక్ వచ్చింది. అన్నీ అనుకున్నట్టే జరిగితే డాక్టర్ దాసరి - పవన్ కలయిక లో వచ్చే సినిమా సెట్స్ మీదికి వెళ్ళే ముందు నుంచీ వచ్చే హైప్ కి హద్దు వుండదు మరి.

English summary

Tollywood Senior And Popular Director and producer Dasari Narayana Rao to make a film with power star Pawan Kalyan. Recently a news cama to know that Dasari Narayana Rao was planning to remake Tamil film "Veeram" in telugu with Pawan Kalyan.