దాసరి హస్తం కూడా ఉందంటున్న సీబీఐ

Dasari's interference in Coal Scam

05:30 AM ON 1st January, 1970 By Mirchi Vilas

Dasari's interference in Coal Scam

బొగ్గు గనుల కేటాయింపు కేసు విషయంలో కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ దాసరి నారాయణ రావు ప్రమేయం ఉన్నట్లు సిబి ఐ ఆరోపిస్తూ , కోర్టుకి నివేదించడం చర్చనీయాంశం అయింది. ఇంకా విచారణలో ఉన్న ఈ కేసుకి సంబంధించి సీబీఐ నివేదికను న్యాయస్థానానికి అందించింది. అయితే ఈ వ్యవహారంతో నాకేం సంబంధం లేదు.. అంతా అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయంతోనే జరిగిందని మాజీ కేంద్రమంత్రి దాసరి నారాయణ రావు చెబుతున్నప్పటికీ , ఇప్పుడు సీబీఐ వాటిని ఖండించి, దాసరి ప్రమేయం కూడా ఉందని తేల్చింది. జిందాల్ గ్రూపు కంపెనీలైన.. జిందాల్ స్టీల్ అండ్ పవర్.. గగన్ స్పాంజ్ ఐరన్ లకు అమరకొండా ముర్గాదంగల్ బొగ్గు గనులను కేటాయించేందుకు గాను పారిశ్రామిక వేత్త నవీన్ జిందాల్, మాజీ బొగ్గుగనుల శాఖ సహాయ మంత్రి దాసరి నారాయణరావు, జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి మధు కోడా, బొగ్గుశాఖ మాజీ కార్యదర్శి హెచ్‌సీ గుప్తా కలిసి జార్ఖంట్ ప్రభుత్వాన్ని ప్రభావితం చేశారని సీబీఐ చెప్పింది. దీనికి సంబంధించిన నివేదిక న్యాయస్థానానికి అందించింది. ఇంతకీ డాక్టర్ దాసరి కి ఇందులో ప్రమేయం ఉందా లేదా ... దీనిపై దాసరి ఎలా స్పందిస్తారో చూడాలి .

English summary

On Wednesday, the Central Bureau of Investigation (CBI) filed an FIR accusing Congress MP Naveen Jindal and the former minister of state for coal Dasari Narayan Rao of fraud and corruption in the allocation of a coal blocks.