టాబ్లెట్ తో ఏడాది పాటు ఇంటర్నెట్ ఫ్రీ

Data Free With Datawind DroidSurfer Tablet

10:46 AM ON 3rd February, 2016 By Mirchi Vilas

Data Free With Datawind DroidSurfer Tablet

డేటావిండ్.. చౌక ధరకే టాబ్లెట్లను రూపొందిస్తున్న దేశీయ సంస్థ. అయితే తాజాగా ఈ కంపెనీ.. డ్రాయిడ్ సర్ఫర్ 10, డ్రాయిడ్ సర్ఫర్ 7 పేరిట రెండు కొత్త ఆండ్రాయిడ్ నెట్‌ బుక్స్‌ను విడుదల చేసింది. రూ.7,999, రూ.5,999 ధరలకు ఈ టాబ్లెట్ లను త్వరలోనే అందుబాటులోకి తీసుకు రానుంది. ఈ టాబ్లెట్ తో పాటు మరో స్పెషల్ ఆఫర్ ను ప్రకటించింది డేటావిండ్. వీటిని కొనుగోలు చేస్తే ఒక ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్‌ను అందించనుంది. అయితే ఇందు కోసం యూజర్లు రిలయన్స్ లేదా టెలినార్ కనెక్షన్‌లను మాత్రమే వాడాలి. అయితే వెబ్‌సైట్ల బ్రౌజింగ్ కోసం మాత్రమే ఈ ఇంటర్నెట్ ఉపయోగపడుతుంది. ఆడియో, వీడియో స్ట్రీమింగ్, డౌన్‌లోడ్స్ కోసం యూజర్లు ప్రత్యేక ఇంటర్నెట్ ప్యాక్‌లను కొనుగోలు చేయాలి. రెండు టాబ్లెట్లలోనూ ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అందిస్తున్నారు. డ్రాయిడ్ సర్ఫర్ 10లో 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను, డ్రాయిడ్ సర్ఫర్ 7లో 4 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందిస్తున్నారు. వీటికి సంబంధించిన ఇతర ఫీచర్లను వెల్లడించాల్సి ఉంది.

English summary

Datawind launches a two new Android Based tablets named Datawind DroidSurfer 10, DroidSurfer 7 .Datawind was providing free internet for one year with these tablets.