మార్కెట్ లోకి  డేటా మినీ కొత్త ల్యాప్ టాప్

Datamini Dual Boot With Windows 10 and Android 5.1 Launched

07:28 PM ON 7th November, 2015 By Mirchi Vilas

Datamini  Dual Boot With Windows 10 and Android 5.1 Launched

ఈ రోజుల్లో స్మార్ట్ ఫోన్ ప్రతీ ఒక్కరి చేతిలో ఇమిడిపోయి ప్రపంచాన్ని తమ అరచేతిలోకి తీసుకువచ్చంది. ఒకవైపు ఆండ్రాయిడ్ మరో వైపు యాపిల్ సరికొత్త ఫీచర్స్‌తో వినియోగదారులను ఆకట్టుకుంటుంటే, ఆ రేసులో ఇండియాలో మాత్రం ఆండ్రాయిడ్ కొంచెం దూకుడుతో ముందుకు సాగిపోతుంది. అత్యాధునిక ఫీచర్లతో మొబైల్ ఫోన్లు సాంప్రదాయ కంప్యూటర్ వినియోగదారులను ఆకట్టుకుంటుండడంతో సాఫ్ట్‌వేర్ రారాజు మైక్రోసాఫ్ట్ కూడా తన విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మొబైల్ ఆధారితంగా తీసుకువచ్చింది. అది మొబైల్ విప్లవం యొక్క జోరు. ఇప్పుడు డేటామిని అనే కంపెనీ విండోస్ తో పాటుగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం కలిగిన డ్యూయల్ ఆపరేటింగ్ సిస్టం కలిగిన లాప్‌టాప్‌లను మార్కెట్‌లోకి తెచ్చింది. అంటే ఒకే డివైస్ లాప్‌టాప్ , మొబైల్ ఫోన్‌లా కూడా పనిచేస్తుంది అన్నమాట.

డేటామినీ కంపెనీ కొత్తగా ల్యాప్ టాప్ డ్యూయల్ ( 2-ఇన్-1) బూట్ విధానాన్ని ఆండ్రాయిడ్ 5.1, విండోస్ 10 తో ప్రారంభించింది. ఇందుకు గాను స్నాప్ డీల్ తో కలిసి భాగస్వామ్యం కుదుర్చుకుంది. 9,999 రూ. ల. కే ఈ ల్యాప్ టాప్ ను అందిస్తున్నారు. స్నాప్ డీల్లో మాత్రమే ప్రత్యేక ఆఫర్స్, వారంటీ తో ఆన్ లైన్ లో లభిస్తుంది .

ఈ లాప్‌టాప్ ఫీచర్స్ లో కెళితే డిస్ప్లే స్క్రీన్ 1280 x 800 పిక్సల్స్ , ప్రాసెసర్ 1.33 జీ హెచ్ జెడ్ (GHz), 2 జీ బి (GB) రామ్, ఇన్బిల్ట్ 32 జీ బి(GB) స్టోరేజ్ కెపాసిటీ తో ఆకట్టుకునేల తయారు చేసారు . విండోస్ 10, ఆండ్రాయిడ్ 5.1....ఈ రెండు ఓఎస్ లను ఒకేసారి ఉపయోగించే సౌలభ్యాన్ని ఈ ల్యాప్ టాప్ లో పొందుపరిచారు . బ్లూటూత్ 4.0, మైక్రో యు ఎస్ బి, వై. ఫై , మినీ-హెచ్ డి ఎం ఐ కనెక్టివిటీ తో లభిస్తుంది .

English summary

Datamini Dual Boot With Windows 10 and Android 5.1 Launched, Snapdeal, Lollipop, Wi-Fi