ట్యాబ్లెట్+ఫ్రీ బ్రౌజింగ్@రూ.2,999

Datawind 7SC Tablet With Free Internet

06:34 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Datawind 7SC Tablet With Free Internet

చవక ధరకే ట్యాబ్లెట్‌లను రూపొందించే దేశీయ సంస్థ డేటావిండ్ మరో కొత్త ట్యాబ్లెట్‌ను రిలీజ్ చేసింది. డేటావిండ్‌ 7ఎస్‌సీ పేరుతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ కొత్త ట్యాబ్లెట్ ధర రూ.2,999. ఈ ట్యాబ్లెట్‌లో ఆర్‌కామ్‌, టెలినార్‌ నెట్‌వర్క్‌ల సహాయంతో యూబీసర్ఫర్‌ బ్రౌజర్‌ ద్వారా ఏడాది పాటు ఉచిత ఇంటర్నెట్‌ బ్రౌజింగ్‌ కూడా అందిస్తుండటం విశేషం. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్‌ స్నాప్‌డీల్‌ ద్వారా ఈ ట్యాబ్లెట్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. 7 అంగుళాల తెర, డ్యుయల్‌ సిమ్‌, 1.3 గిగాహెడ్జ్‌ సింగిల్‌కోర్‌ మీడియా టెక్‌ ప్రాసెసర్‌, 512 ఎంబీ ర్యామ్‌, 4జీబీ ఇంటర్నల్‌ మెమొరీ, 2400 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ 4.4.2 ఆపరేటింగ్ సిస్టమ్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. ఈ ట్యాబ్లెట్ లో వెనుక కెమెరా మాత్రమే ఉంది. మెమరీని 32 జీబీ వరకు పెంచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ట్యాబ్లెట్ బ్లాక్ కలర్ లో మాత్రమే లభ్యమవుతోంది.

English summary

Datawind on Friday launched the Datawind 7SC aka Datawind PC 7SC budget tablet in India. Priced at Rs. 2,999 and offers free Internet surfing for one year via the UbiSurfer browser