రూ.3 వేలకే 4జి ఫోన్.. ఏడాది పాటు ఉచిత నెట్

Datawind to Launch 4G Smart Phone For 3,000

06:09 PM ON 14th December, 2015 By Mirchi Vilas

Datawind to Launch 4G Smart Phone For 3,000

అతి తక్కువ ధరకే ట్యాబ్ లెట్లను తయారు చేసి అందించిన డేటావిండ్ సంస్థ వచ్చే ఏడాదిలో రూ.3 వేలకే 4జీ ఫోన్‌ను అందించేందుకు సిద్ధమైంది. ఈ ఫోన్ కొనుగోలు చేస్తే 12 నెలలపాటు ఉచితంగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని కూడా కల్పించనుంది. ఈమేరకు కంపెనీ సిఇఒ సునీత్ సింగ్ తులి ప్రకటించారు. అయితే ఈ ఫోన్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకునే అవకాశం లేదని, బ్రౌజింగ్ మాత్రమే ఉచితంగా ఉంటుందని అన్నారు. ఎవరైనా ఏ వైబ్‌సైట్‌నైనా ఉచితంగా బ్రౌజింగ్ చేసుకునే అవకాశం ఉందని సునీత్ స్పష్టం చేశారు. ఉచితంగా 2జి, 3జి ఇంటర్నెట్ బ్రౌజింగ్ కోసం ఇప్పటికే రిలయన్స్, టెలినార్ సంస్థలతో కంపెనీ భాగస్వామ్యం కలిగి ఉందని తెలిపారు. మరికొన్ని టెలికాం ఆపరేటర్లతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ మొబైళ్లను వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నాటికి మార్కెట్లోకి తీసుకురానున్నామని సునీత్ తులి తెలిపారు.

English summary

Datawind will launch a 4G smart phonenext year for Rs. 3,000 and offer free Internet browsing for 12 months on it.