కేంద్ర మంత్రివర్గ విస్తరణ ఖరారు

Date confirmed for Cabinet ministers expansion

01:00 PM ON 4th July, 2016 By Mirchi Vilas

Date confirmed for Cabinet ministers expansion

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది. గత కొద్దిరోజులుగా కేంద్రమంత్రివర్గ విస్తరణ మీద చాలానే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా.. మంత్రివర్గ విస్తరణ కోసం అధికారికంగా ముహుర్తం నిర్ణయించి మరీ వెల్లడించారు. మంగళవారం ఉదయం 11 గంటలకు మంత్రివర్గ విస్తరణ ఉండనుందని అధికార వర్గాలు వెల్లడించాయి. ఈ కార్యక్రమం పూర్తి అయిన రెండు రోజులకే ప్రధాని మోడీ ఈ నెల 7న నాలుగు దేశాల పర్యటనలో భాగంగా ఆఫ్రికాకు వెళ్లనున్నారు. కొందరు మంత్రులకు ప్రమోషన్లు.. మరికొందరికి డిమోషన్ తప్పదన్న అంచనాలు ఒకపక్క వినిపిస్తున్నాయి.

ఇక.. సీనియర్ మంత్రులు చూసే శాఖల విషయంలో ఎలాంటి మార్పులు ఉండవని చెబుతున్నారు. గత కొద్ది రోజులుగా అప్పుడు.. ఇప్పుడు అంటూ రకరకాల ఊహాగానాలు చోటుచేసుకున్నా, కార్యరూపం దాల్చలేదు. వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజా మంత్రివర్గ విస్తరణలో ఆ రాష్ట్రానికి చెందిన నేతలకు ప్రాధాన్యం కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. అదే సమయంలో ఈ మధ్య కాలంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగి సానుకూల ఫలితాలు వెల్లడి కాని బీహార్ లాంటి రాష్ట్రాలకు చెందిన నేతలపై వేటు పడే అవకాశం ఉంది.

అసోం ముఖ్యమంత్రిగా సోనోవాల్ కేంద్రక్రీడల మంత్రిగా తన పదవికి రాజీనామా చేయటం.. మరికొన్ని శాఖలకు మంత్రులు లేని నేపథ్యంలో.. వీటి భర్తీ కోసం తాజా విస్తరణ చేస్తున్నట్లు అంటున్నారు.

English summary

Date confirmed for Cabinet ministers expansion