ప్రభాస్-సుజిత్ సినిమాకు ముహూర్తం ఫిక్స్!

Date fixed for Prabhas new movie

11:14 AM ON 21st September, 2016 By Mirchi Vilas

Date fixed for Prabhas new movie

హీరో ప్రభాస్ పేరు చెప్పగానే మనకళ్లముందు బాహుబలి మెదులుతాడు. ఎందుకంటే, గత నాలుగు సంవత్సరాలుగా ప్రభాస్ బహుబలి తోనే బిజీగా ఉన్నాడు. దాంతో మిర్చి లాంటి కమర్షియల్ సినిమాలను చేయడానికి వీలు లేకుండా పోయింది. ఇక ఇప్పుడు రన్ రాజా రన్ దర్శకుడితో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో బాహుబలి 2 తర్వాత ప్రభాస్ చేయబోయే ఈ చిత్రం ఇదే అని అంటున్నారు. మాంచి యాక్షన్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులని పూర్తి చేసుకుని షూటింగ్ కి రెడీగా ఉంది.. తెలుగు తమిళంతో పాటు హిందీలోనూ విడుదల అవుతున్న ఈ సినిమా డిసెంబర్ 10న ప్రారంభంకానుందని తెలుస్తోంది.

షూటింగ్ లో భాగంగా యాక్షన్ సీక్వెన్స్ ని దుబాయ్ లో చిత్రీకరిస్తారట. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్ లో ఉన్న ప్రభాస్ నవంబర్ కల్లా బాహుబలి పనులన్నీ కంప్లీట్ చేసి ఒక నెల రెస్ట్ తీసుకుని సుజిత్ సినిమాకి షిఫ్ట్ అవుతాడని అంటున్నారు. ఇది కాక మరో పిక్చర్ కూడా రెడీగా ఉందట. చూద్దాం ఏమవుతుందో.

ఇది కూడా చదవండి: ఐటెం సాంగ్ కి రూ. కోటి తీసుకున్న తమన్నా.. అందుకే రెచ్చిపోయింది..

ఇది కూడా చదవండి: ఫ్రీగా ఇంటర్నెట్ కావాలంటే మీ ఫోన్ లో ఈ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకోండి

ఇది కూడా చదవండి: కొత్త ఇంటికి గృహ ప్రవేశం చేస్తున్న మాటీవీ

English summary

Date fixed for Prabhas new movie. Prabhas ans Sujith movie date was fixed. This movie shooting will starts on December 10th.