డేటింగ్‌ యాప్స్‌తో హెచ్ఐవి పెరుగుతుందట!

Dating Apps Causes Rise HIV In Asian Teens

04:28 PM ON 2nd December, 2015 By Mirchi Vilas

Dating Apps Causes Rise HIV In Asian Teens

ఇటీవల యునైటెడ్‌ నేషన్స్‌ వారు చేసిన పరిశోధన తెలిపిన విషయం అందరిని విస్మయానికి గురిచేసింది . ఈ పరిశోధన ప్రకారం డేటింగ్‌ యాప్‌ల వల్ల ఆసియా ఖండం లోని యువత హెచ్‌ఐవి బారిన పడుతున్నారని తేలింది. రెండేళ్ళపాటు చేసిన అధ్యయనం లో హెచ్‌ఐవి ఎక్కువగా సోకిన వారిలో టీనేజ్ వారు ఉన్నారని తేలింది. వీరిలో 10-19 సంవత్సరాల వయసు గలవారు అధికులని,డబ్బు చెల్లించి మరీ డేటింగ్‌ యాప్‌ సర్వీసులను వాడుకుంటున్న వారిలో 10-19 ఏళ్ళ వయసువారు రెండోస్థానంలో ఉన్నారని తెలిపారు.

హెచ్‌ఐవి వ్యాధి సోకిన పురుషుల సంఖ్య వేగంగా పెరుగుతుందని తేలింది . పురుషులు ఇతర పురుషులతో సెక్స్‌ చెయ్యడం వల్ల హెచ్‌ఐవి వ్యాధి ఎక్కువగా సోకుతుందని పరిశోధనలలో తేలింది. హెచ్‌ఐవి వ్యాధి బారిన పడుతున్న వారిలో వీరే అధికమని పరిశోధనలో తేలింది .

యునిసెఫ్‌ సలహాదారు వింగ్‌-సీ మాట్లాడుతూ డేటింగ్‌ యాప్‌ వినియోగం ద్వారా వినియోగదారుల మధ్య వ్యాధి వ్యాప్తి చెందుతుందని అన్నారు . దీనికి తక్షణమే అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు. హెచ్‌ఐవి అనేది రహస్య సమస్య కాబట్టి దాని గురించి సమాచారం అందుబాటులో లేదని అన్నారు.

టీనేజ్‌ వారిలో హెచ్‌ఐవి ఎక్కువ గా వ్యాప్తి చెందుతుందని . హెచ్‌ఐవి వ్యాధి ఉన్న వారిలో సగంమంది చికిత్స తీసుకుంటున్నారని, చనిపోతున్న వారి సంఖ్య గత దశాబ్ద కాలంగా పెరిగిపోయిందని తెలిపింది.

English summary

Dating apps are causes HIV to increase amongst Asian teenagers, according to an United Nations research.It also found that HIV is growing fast when men who have sex with other men.