రోహిత్ ఆత్మహత్య పై స్పందించిన  దత్తాత్రేయ 

dattatreya responds on rohit suicide

05:24 PM ON 20th January, 2016 By Mirchi Vilas

dattatreya responds on rohit suicide

హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయం (హెచ్‌సీయూ) లో పీహెచ్‌డీ విద్యార్థి రోహిత్‌ ఆత్మహత్య ఘటన దుమారం రేగిన నేపధ్యంలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ స్పందిస్తూ రోహిత్ ఆత్మహత్య తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. రోహిత్‌ కుటుంబసభ్యులకు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. గతేడాది ఆగస్టు 10న తనకు అందిన వినతిపత్రాన్ని మానవ వనరులశాఖకు పంపానని, ఆగస్టు 29న రెండో వినతిపత్రాన్ని కూడా పంపించినట్లు దత్తాత్రేయ వివరించారు. హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని ఆయన పేర్కొంటూ, దాని పాలనలో ఎవరి ప్రమేయం ఉండదన్నారు. రాహుల్ తీరుపై కామినేని ఫైర్...
కాగా రోహిత్ ఆత్మహత్య ఘటనపై రాహుల్ గాంధి హుటాహుటీన రావడంపై బిజెపి నేత, ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ స్పందిస్తూ, విద్వేషాలు రెచ్చగొట్టేందుకే రాహుల్ భాగ్యనగరం వచ్చారన్నారు. గతంలో ఎన్నో ఆత్మహత్యలు జరిగినప్పుడు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు

English summary

dattatreya responds on rohit suicide