తల్లికి దగ్గరుండి ప్రేమ పెళ్లి జరిపించిన కూతురు..

Daughter did marriage for her mother

12:01 PM ON 28th July, 2016 By Mirchi Vilas

Daughter did marriage for her mother

పెళ్లంటే నూరేళ్ళ పంట అన్నారు. పెళ్లి అయ్యాక పిల్లలు గట్రా వస్తారు. కానీ ఇదో చిత్రమైన కేసు. తన తల్లికి నచ్చినోడుతో స్వయంగా కూతురే దగ్గరుండి పెళ్లి జరిపించిందట. దీంతో 32 ఏళ్ల ఓ సుదీర్ఘ నిరీక్షణ ఫలించిందట. ప్రేమ విఫలమై ఎవరి దారుల్లోకి వారు వెళ్లిపోయాక.. తాగుబోతు భర్తతో ఆమె..! పెళ్లి ప్రస్తావనే మరిచిపోయి రాజకీయాల్లో మునిగిపోయిన ఆయన..! దాదాపు మూడు దశాబ్ధాల తర్వాత తిరిగి ఒక్కటయ్యారు. అది కూడా, ఆమె కూతుళ్లు చూపించిన చొరవతోనే కావడం విశేషం. తల్లి ప్రేమించిన వ్యక్తితో ఆమెకు దగ్గరుండి మరీ వివాహం జరిపించింది కేరళకు చెందిన అథిరా అనే ఓ కూతురు. విషయాన్ని ఫేస్ బుక్ ద్వారా పోస్ట్ చేయడంతో ప్రస్తుతం కేరళ అంతటా ఈ పెళ్లి ఓ హాట్ టాపిక్ గా మారింది.

1/5 Pages

ఇంటరెస్టింగ్ గా వున్న ఈ స్టోరీ లైన్ లోకి వెళ్తే.. 1984లో కేరళలోని ఒచిరాకు చెందిన అనిత, విక్రమన్ ప్రేమించుకున్నారు. అనిత ఆ సమయంలో 10వ తరగతి చదువుతుండగా.. ఆమె కంటే ఎనిమిదేళ్లు పెద్దయిన విక్రమన్ సీపీఐ నేతగా అటు రాజకీయాల్లోను, ట్యూటర్ గాను పనిచేస్తుండేవారు. అయితే వయసులో పెద్దవాడు, ఓ సీపీఐ నేత అయిన అతన్ని కూతురు ప్రేమించడం అనిత తండ్రి సహించలేకపోయాడు. దీంతో వెంటనే అనితను స్కూల్ మానిపించేసి, విక్రమన్ ను మరిచిపోవాల్సిందిగా కూతురుని హెచ్చరించాడు. ఒకవేళ తాను విక్రమన్ నే పెళ్లి చేసుకోవాలని ప్రయత్నిస్తే, అతని లైఫ్ కే డేంజర్ అని హెచ్చరించాడు.

English summary

Daughter did marriage for her mother