కోడలు అత్తగారితో చెప్పకూడని విషయాలు...

Daughter in law doesnot say this things to Mother in law

05:58 PM ON 30th March, 2016 By Mirchi Vilas

Daughter in law doesnot say this things to Mother in law

అత్తాకోడళ్లు అంటే నిప్పు ఉప్పులాగే కాదు, మంచి స్నేహితులుగా ఉండేవారు, ఒక‌రిని ఒక‌రు గౌర‌వించుకునేవారూ కూడా ఉన్నారు. ఆత్మగౌర‌వం అనే మాట‌కు అర్థం తెలిసిన ఏ అమ్మాయి అయినా మ‌రొక స్త్రీని తక్కువ చేసి మాట్లాడదు. ఈ విషయం పక్కన పెడితే, ఎంత స్నేహంగా ఉన్నా కొన్ని మాటలు ఏ కోడలు తన అత్త గారి దగ్గర అనకూడదు. తన కోడలు గురించి ఎంత బాగా ఆలోచించే అత్త అయినా కొన్ని విషయాల్లో కోడలు నోటి నుండి వచ్చే కొన్ని మాటలకి ఉడుక్కుంటుంది. ఏదో స్నేహంగా ఉంటుంది కదా అని ఏమన్నా బాధ పడదు అనుకుంటే పొరపాటే.. దీని వల్ల చిన్న చిన్నగా అత్తా-కోడళ్లు ఇద్దరి మధ్య దూరం పెరిగి గోడవలకి దారి తీసే ప్రమాదం కూడా ఉంది.

ఎందుకంటే ఒక అమ్మాయి పెళ్లి చేసుకుని అత్త గారి ఇంటికి వెళ్ళింది అంటే అక్కడ అత్త గారు సరిగా ఉంటేనే ఆమె సంతోషంగా ఉండగలదు. కాబట్టి కొన్ని విషయాలు ప్రతీ కోడలు తమ అత్త గారి దగ్గర అనుకూడని మాటలు ఏంటో తెలుసుకోండి.

1/5 Pages

1. మీకంటే మీ అబ్బాయి గురించి నాకు బాగా తెలుసు..

అని మాత్రం ఎప్పుడూ అత్త‌గారితో ఏ కోడ‌లూ అన‌కూడ‌దు. ఎందుకంటే ఈ లోకంలో ఏ త‌ల్లి అయినా త‌న కొడుకు గురించి త‌న‌కే బాగా తెలుసని అనుకుంటుంది. చిన్నప్పటి నుండి తనని పెంచి పోషించింది ఆ తల్లే కాబట్టి. ఒక భార్య‌గా తన కోడ‌లికి కొడుకు మ‌నసులో ప్రత్యేక స్థానం ఉంటుంద‌ని ఆ తల్లికి తెలిసినా, కొడుకుకి మానసికంగా మాత్రం తానే ద‌గ్గ‌ర అనే భావం త‌ల్లిలో ఎప్పుడు ఉంటుంది. త‌మ ఆస్తిని మరియు ఆస్తి పెత్తనం కోడ‌లుకి అప్పజెప్పుతున్నాం అనే చాలా మంది అత్తలు భావిస్తుంటారు. అది కొడుకు మీద ఉన్న ప్రేమే అనుకున్నా, అందులో ఒక అభ‌ద్ర‌తా భావం కూడా ఉంటుంది. అందుకే అత్త గారి వ‌ద్ద ఈ మాట ఎప్పుడూ అనవొద్దు.

English summary

Daughter in law doesnot say this things to Mother in law. Don't discuss any Daughter in law these things with your Mother in law.