దారుణం.. అత్తమామలే పడకగది దృశ్యాలు చిత్రీకరించి.. ఆపై...

Daughter in law romance videos taken by father in law

11:04 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Daughter in law romance videos taken by father in law

కోడల్ని కన్న కూతురిలా చూసుకోవాల్సిన అత్తమామలే కిరాతానికి ఒడిగట్టారు. కంటికి రెప్పలా కాపాడాల్సిన అత్తమామలే నీచానికి తెర తీశారు. ఆ వివరాల్లోకి వెళితే.. కట్నం కోసం అత్తమామలే దారుణానికి పాల్పడిన ఘటన ఓడిశా రాష్ట్రంలో జరిగింది. కట్నం కోసం కొత్త కోడలి పడకగది దృశ్యాలను రహస్యంగా చిత్రీకరించిన అత్తమామల దురాగతం ఓడిశా రాష్ట్రంలోని ఖుర్దా పోలీసుస్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించింది. ఖుర్దా నగరంలో నివాసముంటున్న డాక్టరు నీరజానళిని దంపతులు తన కుమారుడికి మూడు వారాల క్రితం పెళ్లి చేశారు. అత్తమామలే పడకగదిలో రహస్యంగా సీసీ కెమెరాను ఏర్పాటు చేసి కోడలి పడకగది దృశ్యాలను చిత్రీకరించారు.

ఆపై పుట్టింటి నుంచి రూ.35 లక్షల కట్నం తీసుకురాకుంటే ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పెడతామని కోడలిని అత్తమామలు బెధిరించారు. పెళ్లి అయిన మూడు వారాలకే ఇలా పడకగది దృశ్యాలను చిత్రీకరించి కట్నం తెమ్మని మానసికంగా, శారీరకంగా వేధిస్తుండటంతో ఆ కోడలు అత్తింటి నుంచి పుట్టింటికి తిరిగి వచ్చింది. అత్తింటి బ్లాక్ మెయిలింగ్, కట్నం వేధింపులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: ఆయనకు 83 - ఆమెకు 81 ... అనారోగ్యం వెంటాడుతున్నా అన్యోన్యత

ఇది కూడా చదవండి: హీరో విక్రమ్ అలవాట్లు ఏమిటో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

ఇది కూడా చదవండి: పవర్ స్టార్ కి చురకలంటించిన జేసీ

English summary

Daughter in law romance videos taken by father in law