ప్రియమైన నాన్నా... ఆ సినిమా చూసి తండ్రికి కూతురు లేఖ!

Daughter wrote a letter to father after watching Pink movie

04:29 PM ON 28th September, 2016 By Mirchi Vilas

Daughter wrote a letter to father after watching Pink movie

సినిమా అనేది మనిషి జీవితంపై తీరని ప్రభావం చూపిస్తుంది. అందుకే మనదైన సంస్కృతిని అద్దంపట్టే సినిమాలు రావాలని, పెడధోరణులకు వేదిక కారాదని అంటుంటారు. అమ్మా కొడుకు, తండ్రి కూతురు కల్సి చూసే చిత్రాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఇదిగో 'పింక్' సినిమా ఎలా ఉందో గానీ, దీని గురించి ఓ తండ్రికి కూతురు రాసిన లేఖ చూడండి. నేనీరోజు 'పింక్' అనే సినిమా చూశా. ఆ సినిమా చూడటం వల్ల నాలో ఈ జ్ఞాపకాలన్నీ కదిలాయి. నాన్నా! నాకంటూ ఒక జీవితాన్ని ఏర్పరుచుకునేందుకు మంచి స్కూల్లో చేర్పించారు. స్కూలు ఎక్స్ కర్షన్ లకు వెళ్లకుండా ఏనాడూ ఆపలేదు. దాంతో ఈ ప్రపంచంపై ఓ అవగాహన కలిగింది. అంతేనా నేను బైక్ కొనకుండా మీరు అడ్డుపడలేదు.

పైగా కారు డ్రైవింగ్ నేర్చుకొమ్మని ప్రోత్సహించారు. అబ్బాయిలు మాత్రమే ఉన్న క్రికెట్ బృందంతో నేనొక్కదాన్నే కలిసి ఆడటంపై ఎన్నడూ అభ్యంతరం చెప్పలేదు. కాలేజీ ఫ్రెండ్స్ తో కలిసి విహారయాత్ర చేయడాన్ని ఆక్షేపించలేదు. స్నేహితులతో కలిసి నేను గోవా వెళ్లడాన్ని ఆపలేదు. నా జీవిత భాగస్వామిని నేనే ఎంచుకునే పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఆ తర్వాత నేను అలాగే చేశాను కూడా. నిజానికి, నేను నా తొలి ఉద్యోగానికి ఎంపిక కావడం ద్వారా నేను ప్రపంచపు శిఖర భాగాన్ని అందుకున్నా. నాకైతే మీతో కలిసి ఈ సినిమా చూడాలని ఉంది.

ఎందుకంటే ఎంతో మందికి ఈ సినిమా గొప్ప కనువిప్పు కలిగిస్తుంది. నాన్నా! నేను ఎలా ఉండాలని అనుకునేదాన్నో నన్ను మీరు అలాగే ఉండనిచ్చినందుకు మీకు కృతజ్ఞతలు.
- పూర్వీ అగర్వాల్ హైదరాబాద్

సోషల్ మీడియాలో వైరల్ గా తిరుగుతున్న ఈ ఉత్తరాన్ని సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రీట్వీట్ ఇదిగో ఇలా కామెంట్ చేశాడు.. 'పింక్ సినిమా చూసిన ప్రేక్షకులంతా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తున్నారు. ఏళ్ల పర్యంతం ఇలాంటి వ్యాఖ్యలే వినడానికి ఎంతో మంది ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు కూడా'.

English summary

Daughter wrote a letter to father after watching Pink movie