దావూద్ కి దిమ్మతిరిగింది

Dawood Ibrahims Asset Worth Rs 15000 Cr Seized

11:11 AM ON 4th January, 2017 By Mirchi Vilas

Dawood Ibrahims Asset Worth Rs 15000 Cr Seized

దేనికైనా టైం రావాలని అంటారు పెద్దలు. పాపం పండాలని అంటారు. సరిగ్గా ఇక్కడ అదే జరిగింది. ముంబై వరుస పేలుళ్ళ సూత్రధారి, అండర్ వరల్డ్ కింగ్ దావూద్ ఇబ్రహీం ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.15,000 కోట్లు ఉంటుందని అంచనా. డాన్ దావూద్ ఇబ్రహీంకు ఇండియా, పాకిస్థాన్ తో పాటు దుబాయ్, మొరాకో, స్పెయిన్, సింగపూర్, థాయిలాండ్, సైప్రస్, టర్కీలో పలు ఆస్తులున్నాయి.

అయితే దుబాయ్ లోని రూ.15 వేల కోట్ల ఆస్తులను యూఏఈ ప్రభుత్వం మంగళవారం స్వాధీనం చేసుకుంది. గత ఏడాది దుబాయ్ వెళ్ళిన ప్రధాని మోడీ, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, దావూద్ కు సంబంధించిన అక్రమాస్తుల వివరాలను ఆ ప్రభుత్వానికి అందజేసినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేసిన యూఏఈ అధికారులు దావూద్ కు చెందిన గోల్డెన్ బాక్స్ కంపెనీ ఆస్తులు, షేర్లతోపాటు పలు హోటల్స్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇంకా మరిన్ని దారులు వెతుకుతున్నట్లు వార్తలువస్తున్నాయి.

ఇది కూడా చూడండి: ఈ అమ్మడు బికినీ లో హాట్ హాట్ గా ...

ఇది కూడా చూడండి: కింగ్ కు ఎక్కడో కాలిందట

English summary

Dawood Ibrahim's Asset Worth Rs 15000 Cr Seized.