పగటి కలలు కంటే ఒబేసిటీ ఖాయం

Day Dreamers Has High Obesity Chances

05:30 PM ON 28th January, 2016 By Mirchi Vilas

Day Dreamers Has High Obesity Chances

పొద్దస్తమాను నిద్రపోతూ పగటి కలలు కంటున్నారా.. అయితే మీకు స్థూలకాయం(ఒబేసిటీ) ముప్పు పొంచిఉన్నట్టే. పగటి కలల్లో మునిగేవారు తమకు తెలియకుండానే ఎక్కువగా తినేయడం వల్ల ఆ విషయాన్ని గుర్తించలేరని, తద్వారా అధిక బరువు పెరుగుతారని పరిశోధకులు చెబుతున్నారు. అధిక బరువుండే వ్యక్తుల మెదళ్లు ఎక్కువగా తినే తరహాలో సన్నద్ధమై ఉంటాయనీ, ఫలితంగా.. పగటి కలలు కనేటప్పుడు.. అప్పటికే తాము అధికంగా తిన్నామన్న సంగతినీ, తినడం కొనసాగిస్తున్నామన్న విషయాన్ని గుర్తించలేరని హెచ్చరిస్తున్నారు. కొంతమంది చిన్నారులపై చేపట్టిన పరిశోధనల ఆధారంగా ఈ అంశాన్ని వెల్లడించారు. ఈ అధ్యయనంలో భాగంగా మెదడులో బరువు, ఆహార అలవాట్లకు సంబంధించిన భాగాల ఎంఆర్‌ఐ స్కానింగ్‌లనూ పరిశీలించారు. చిన్నారుల మెదడు పనితీరును మరింత క్షుణ్ణంగా పరిశీలించాలని భావించామనీ, వూబకాయులైన చిన్నారుల్లో నాడీపరంగా ఏం జరుగుతోందో మరింత మెరుగ్గా అవగాహన చేసుకోగలమని పరిశోధకులు డాక్టర్‌ రోనాల్డ్‌ కోవాన్‌ పేర్కొన్నారు.

English summary

A Department of Health Researchers found that day dreamers have high chances to get obesity.They said that the day dreamers will eat more without knowing them.So they said that eating more will cause obesity