పుష్కరాలలో ఏరోజు ఏ దానం చేస్తే మంచిదో తెలుసా !

Daywise Pushkara Dhana

03:09 PM ON 10th August, 2016 By Mirchi Vilas

Daywise Pushkara Dhana

పుష్కరాలలో నదీ స్నానం, పిండ ప్రదానం , దైవ దర్శనం ప్రధానాంశాలు. ఒక్కో నదికి ఒక్కో ఏడాది పుష్కరాలు వస్తాయి. ఇక ఈ ఏడాది కృష్ణా పుష్కరాలు జరుగుతున్నాయి. ఆగస్టు 12 నుంచి 23 వరకూ 12 రోజుల పాటు జరిగే కృష్ణా పుష్కరాల కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సమయంలో పితృ కర్మల తో పాటు ఆయా రోజుల్లో పితృ దేవతల పేర్లు చెప్పి, దానాలు చేయడం రివాజు. ఇలా చేయడం వలన కొన్ని ఫలితాలు కలుగుతాయట. అయితే ఏ రోజు ఏదానం చేస్తే మంచిదో, ఒకసారి పరిశీలిద్దాం.

1/13 Pages

మొదటి రోజు:

పుష్కరాల తొలిరోజు బంగారం, వెండి, ధాన్యం, భూమి దానం చేయాలట. బంగారం, వెండి దానం చేయడం వల్ల ఇహలోక సుఖభోగాలతో పాటు సూర్యచంద్ర లోకాల ప్రాప్తి కలుగుతుంది. భూదానం వల్ల భూపతిత్వం వస్తుంది. ధాన్య దానం వల్ల కుబేర సంపద కలిగిస్తుందని అంటారు.

English summary

Daywise Pushkara Dhana. Fist day silver, grain, land and you donate Gold. Second day Cow & Lamb, Salt, Stone etc