కేజ్రీవాల్‌ పై డీడీసీఏ కేసు

DDCA Files Case On Kejriwal

12:34 PM ON 2nd January, 2016 By Mirchi Vilas

DDCA Files Case On Kejriwal

డీడీసీఏ లో అక్రమాలు, మహిళల పట్ల అసభ్యంగా డీడీసీఏ అధికారులు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని కేజ్రీవాల్‌ ఆరోపించారు. దీని పై ఒక విచారణ కమిటీను కుడా కేజ్రీవాల్‌ వేశారు.

అయితే తమపైన అక్రమంగా కేజ్రీవాల్‌ ఆరోపణలు చేస్తున్నారని అతని పైనా, కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను సమర్ధించి జీజేపి నుండి సస్పెండ్‌ అయిన కీర్తి ఆజాద్‌ల పై పరువు నష్టం కేసు వెయ్కనున్నుట్లు డీడీసీఏ అధికారి రవీందర్‌ అన్నారు.

ఇంతకు ముందు కేజ్రీవాల్‌ మాట్లాడుతూ డీడీసీఏ అధికారులు తనకు తెలిసిన ఒక జర్నలిస్ట్‌ కుమారుడిని టీంలో స్థానం దక్కిందని చెప్పాడని దాని తరువాత రోజు అతని కుమారుని పేరు ఆ లిస్ట్‌లో లేదని , అతని భార్య ఫోనుకు డీడీసీఏ లోని అధికారి ఒకరు తన కోరిక తీరిస్తే ఆ అబ్బాయికు టీంలో చోటు కల్పిస్తామని మెసేజ్‌ పంపినట్లు పంపాడని అరవింద్‌ కేజ్రీవాల్‌ ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో వివాదస్పద వ్యాఖ్యలు చేసారు. దీని పై ఇప్పటికే ఇక విచారణ కమిటీని వేయాలంటూ జాతీయ భద్రతా సలహాదారుకు ఢిల్లీ ప్రభుత్వం ఒక లేఖను కూడా రాసింది.

కేజ్రీవాల్‌ ఆరోపణలు ఆవాస్తవమని పేర్కొంటూ కేజ్రీవాల్‌ పై పరువు నష్టం దావా వెయ్యడానికి డీడీసీఏ అధికారులు సిద్దం అయ్యారు.

English summary