తల్లి శవాన్ని సగం చేసి మడతెట్టేశారు

Dead Bodies Treated In Odisha

11:08 AM ON 29th August, 2016 By Mirchi Vilas

Dead Bodies Treated In Odisha

మానవత్వం మంటగలిసిపోతోందని ఆవేదన చెందే కొద్దీ ఇలాంటి ఘటనలు పెచ్చుమీరుపోతున్నాయి. కుటుంబ బంధాలు మంటగలపడం, తల్లి దండ్రుల పట్ల అమానుష ప్రవర్తన లాంటివి కూడా చెలరేగిపోతున్నాయి. తాజాగా ఓ మనిషి శవాన్ని ఇంగిత జ్ఞానం లేకుండా, కాలితో తొక్కి, సగానికి విరగ్గొట్టి, మూటగట్టి మోసుకెళ్లిన దారుణ ఘటన చోటుచేసుకుంది. నిన్నటివరకూ మనలాగే బ్రతికిన మనిషన్న గౌరవంకూడా లేకుండా కన్న కొడుకు ముందే తల్లి శవాన్నిఅవమానించిన ఈ ఘోర ఘటన ఒడిశాలో వెలుగుచూసింది. దీనికి సంబంధించి ఓ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది.

శవాన్ని తరలించేందుకు ఆటోకు డబ్బులు ఎక్కువవుతున్నాయని, మృతదేహాన్ని మూటగట్టి.. కట్టెకు వేలాడదీసి ఆసుపత్రి సిబ్బంది మోసుకెళ్లారు. వివరాల్లోకి వెళ్తే, 76ఏళ్ల సాలామణి బారిక్ గత సోరో ప్రాంతంలో రైలు ఢీకొని మృతిచెందింది. పోస్టమార్టం అనంతరం శవాన్ని తరలించేందుకు హెల్త్ కేర్ సెంటర్ స్వీపర్ల ఈ నిర్వాకానికి ఒడిగట్టారు. ప్రాణం పోయి అప్పటికే గంటలు గడవడంతో మృతదేహం బిగుసుకుపోయింది. అది అలా ఉంటే మోసుకెళ్లడం వీలుకాదని కాలితో తొక్కి.. ఎముకలు విరిచి ప్లాస్టిక్ బ్యాగులో మూటగట్టారు. అనంతరం ఓ గుడ్డలో చుట్టి.. కర్రకు వేలాడదీసి ఇద్దరు సిబ్బంది మోసుకెళ్లారు.

ఇలా తన తల్లిని అలా మోసుకెళ్తున్నా.. తానేమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నానని మృతురాలి కుమారుడు రవీంద్ర బారిక్ వాపోయాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో విషయం తెలుసుకున్న ఒడిశా మానవ హక్కుల కమిషన్ .. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా పోలీసులు, బాలాసోర్ జిల్లా అధికారులకు నోటీసులిచ్చింది. ఎన్ని చేసినా ఓ మాతృ మూర్తి కి జరిగిన అవమానం చెరిగిపోనిది. మానవత్వానికే మాయని మచ్చలాంటింది.

ఇది కూడా చూడండి: ఈ ఏడు కిస్సులు ట్రై చేశారా..?

ఇది కూడా చూడండి: పుట్టుమచ్చల బట్టి మీ మనస్తత్వం

ఇది కూడా చూడండి: మన హీరోలు - హైక్లాస్ ఇళ్ళు

English summary

No Ambulance To Carry Dead Body, Odisha Workers Break Woman's Bones, Stuff It In Bag and slung on bamboo pole.