ఏపీ సర్కారుకు డెడ్ లైన్ పెట్టిన పవర్ స్టార్ (వీడియో)

Dead line for A.P Government by Pawan Kalyan

11:21 AM ON 4th January, 2017 By Mirchi Vilas

Dead line for A.P Government by Pawan Kalyan
రాజకీయ పార్టీ అధినేత అంటే రకరకాల నిర్వచనాలుంటాయి, అయితే మిగిలిన వాళ్లకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి భిన్నం. ప్రశ్నించడానికే జనసేన పుట్టిందని చెప్పిన పవన్ ఈమధ్య వరుస ప్రశ్నలు సంధిస్తున్నాడు. తాజాగా పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఊపిరి ఆగిపోతున్న అమాయక మనుషుల పక్షాన గొంతు విప్పాడు. శ్రీకాకుళం జిల్లాలోని కొన్నిప్రాంతాల సమూహమైన ఉద్దానంలో అంతుబట్టని రీతిలో అక్కడిప్రజలు కిడ్నీ వ్యాధులకు గురి కావటం. పెద్ద ఎత్తున మరణించటం మామూలే. దీనిపై ఇప్పటివరకూ ఏ ప్రభుత్వాలు దృష్టి సారించలేదు. అందుకే 48 గంటల్లో కానీ ఏపీ సర్కారు స్పందించాలంటూ అల్టిమేటం జారీ చేసాడు. విభజన సమయంలో ఏపీ సమస్యల్ని జాతీయ స్థాయిలో చర్చించని నేతలపైనా.. వారి నిర్లక్ష్యాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పిన పవన్, ఇన్ని వేల మరణాలపై ప్రభుత్వాలు ఎందుకు మౌనంగా ఉన్నట్లు అని నిలదీసాడు.
ఉద్దానం ప్రజలు ఎదుర్కొంటున్నకిడ్నీ సమస్యలకు సాంత్వన కలిగించేందుకు రూ.100కోట్లు సరిపోతాయని పలువురు నిపుణులు సూచనలు చేస్తున్న వేళ.. ఆ మొత్తాన్ని ప్రభుత్వం ఎందుకు విడుదల చేయదని పవన్ ప్రశ్నించాడు. ఏపీ రాష్ట్ర సర్కారు ఈ అంశంపై తక్షణమే కమిటీ వేయాలని.. కిడ్నీ వ్యాధులతో చనిపోయిన బాధిత కుటుంబాలకు సాయం చేసే కార్యక్రమాన్నిప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేసాడు.

ఐదుగురు సభ్యులతోకూడిన ఒక నిపుణుల బృందాన్ని నియమించిన పవన్ కల్యాణ్, ఈ అంశంపై 15 రోజుల్లో ఒక నివేదిక తయారు చేసి ఇవ్వాలని.. దాన్ని తీసుకొని తానే స్వయంగా ఏపీ ముఖ్యమంత్రిని కలవనున్నట్లు కూడా చెప్పుకొచ్చాడు. ఈసమస్య పరిష్కారం కోసం అవసరమైన ప్రజాప్రతినిధుల్ని తానే స్వయంగా కలుస్తానని చెప్పారు. ఉద్దానం అంశం ఒక విపత్తుగా పవన్ పేర్కొన్నాడు. ఇంత దారుణం జరుగుతున్నా.. ప్రభుత్వాలు.. ప్రజాప్రతినిధులు పట్టకుండా ఎలా ఉంటారని ప్రశ్నించారు. ఉదానం ఇష్యూ మీద ప్రభుత్వం కానీ స్పందించకుండా ఉండిపోతే.. తానే జాతీయస్థాయిలో దీన్నో ఉద్యమంగా మార్చనున్నట్లు ప్రకటించాడు. రెండు నెలల క్రితం తన దృష్టిని ఉద్దానం అంశం వచ్చినప్పుడు.. పార్టీ తరఫున ఒక బృందాన్ని పంపి.. ఈ ఇష్యూ మీద అధ్యయనం చేపట్టటంతో పాటు.. ఒక డాక్యుమెంటరీని విడుదల చేసిన విషయాన్ని గుర్తుకి తెచ్చాడు. అంతా బానే వుందని, అయితే, పవన్ డిమాండ్లపై ఏపీ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలని పలువురు అంటున్నారు.

English summary

As Pawan kalyan said that Janasana party was born to question yesterday he possed questions and kept dead line for A.P Government about the Kidney Problems of People in Srikakulam.He wants an Immediate response for the problem from government.