చనిపోయాడు ... అయితే మార్చురీలో బతికి బయటపడ్డాడు

Dead Man Found Alive In Mortuary Fridge

12:27 PM ON 16th December, 2016 By Mirchi Vilas

Dead Man Found Alive In Mortuary Fridge

ఒక్కోసారి జరిగే అద్భుతాలు మనకళ్లను మనమే నమ్మలేనట్లుగా ఉంటాయి. అదే మిరాకిల్ .. సర్వత్రా చర్చకు దారితీసే ఇలాంటి ఘటన ఒకటి సంచలనం కల్గిస్తోంది. ఇంతకీ విషయం ఏమంటే, రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వ్యక్తి మరుసటి రోజు మార్చురీ రిఫ్రిజిరేటర్ లో శ్వాస తీసుకుంటూ కనిపించాడట. పూర్తివివరాల్లోకి వెళ్తే, దక్షిణాఫ్రికా డర్బన్ సమీపంలోని క్వమషూకు చెందిన మిసింజీ ఎంఖైజే(28) నడుస్తూ ఇంటికి వస్తుండగా ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. ఘటన స్థలంలోనే అతడు చనిపోయినట్టుగా వైద్య సిబ్బంది నిర్ధారించారు. దీంతో, అతడి దేహాన్ని ఫీనిక్స్ మార్చురీకి తరలించారు. మరుసటి రోజు కుటుంబ సభ్యులు మార్చురీకి వెళ్లి చూడగా అతడు శ్వాస తీసుకుంటూ కనిపించాడు. షాక్ కు గురయిన మార్చురీ సిబ్బంది వెంటనే అతడిని ఫినీక్స్ లోని మహాత్మా గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ కొన్ని గంటల తర్వాత అతడు చనిపోయాడు. సకాలంలో ఆస్పత్రికి తరలించి ఉంటే ఎంఖైజే బతికేవాడని కుటుంబ సభ్యులు వాపోయారు. ‘‘చనిపోకున్నా.. చనిపోయినట్టుగా ఎవరు దృవీకరించారో తెలుసుకోవాలనుకుంటున్నాం. వారి నిర్లక్ష్యం వల్ల మా బిడ్డను మార్చురీ రిఫ్రిజిరేటర్ లో రాత్రంతా ఉంచారు. దీంతో అతడు సకాలంలో వైద్యం అందక చనిపోయాడు’’ అని మిసింజే తండ్రి పీటర్ ఎంఖైజే ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పోలీసులు ఈ కేసును పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చూడండి: ఆడవారి నోటిలో రహస్యాలు దాగవని ఎందుకంటారంటే?

ఇది కూడా చూడండి: తల్లిదండ్రులు చేసిన పాపాలు పిల్లలకి శాపాలుగా తగులుతాయా?

ఇది కూడా చూడండి: మీ కలలో పిల్లలు కనిపిస్తే దాని వెనుక అర్థమేమిటో తెలుసా?

English summary

'Dead' Man Found Alive In Mortuary Fridge.