అప్పుడే ఏడాది అయిందా ....

Death Anniversary Of M.S.Narayana

12:56 PM ON 23rd January, 2016 By Mirchi Vilas

Death Anniversary Of M.S.Narayana

ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు - దర్శకుడు ఎం.ఎస్.నారాయణ ఈలోకం నుంచి నిష్క్రమించి, అప్పుడే ఏడాది అయిందా. వెండి తెరపై నవ్వ్లులు పూయించిన ఎం ఎస్ తాగుబోతు పాత్రలను పోషించడంలో ప్రసిద్ధుడుగా నిలిచాడు. దాదాపు 700 చిత్రాలలో నటించారు. కొడుకు, భజంత్రీలు చిత్రాలకు దర్శకత్వం వహించారు.ఆయన ఎమ్మెస్ నారాయణ తన నట జీవితంలో 5 నంది అవార్డులు( రామసక్కనోడు, మానాన్నకు పెళ్లి, సర్దుకుపోదాం రండీ, శివమణి, దూకుడు) అలాగే 2 సినీ గోయెర్స్ అవార్డులు పొందారు. దూకుడు చిత్రానికి ఉత్తమ సహాయనటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును అందుకున్నాడు. దాదాపు 200 చిత్రాల్లో తాగుబోతు పాత్రల్లో ఒదిగి పోయాడు. గ్లాస్ చేతిలో పట్టుకున్న ఎం ఎస్ ప్రతిపాత్రను ప్రేక్షకులు ఎంతో ఎంజాయ్ చేశారు. అదేవిధంగా పేరడీ పాత్రలకు ఎమ్మెస్ పెట్టింది పేరు. దూకుడు, డిస్కో, దూబాయ్‌శీను తదితర చిత్రాల్లో పేరడీ, నటనా వైవిధ్యం ప్రదర్శించడం ద్వారా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయాడు.

పశ్చిమగోదావరి జిల్లా కె.జి.ఆర్ కళాశాలలో అధ్యాపకుడిగా పని చేసిన ఎంఎస్ కళారంగంపై ఉన్న ఆస్తకితో అధ్యాపకుడి పదవికి రాజీనామా చేసి, నటనారంగంలో అడుగులు వేశాడు. రచయితగా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన ఎంఎస్ ఎనిమిది చిత్రాలకు రచయితగా పనిచేశాడు. ఎమ్మెస్ నటించిన తొలిసినిమా యమ్.ధర్మరాజు ఎం.ఎ. ఇక ఎంఎస్ కుమారుడు విక్రంను కొడుకు చిత్రం ద్వారా తన చిత్ర ప్రస్థానాన్ని ప్రారంభించాడు .ఎం.ఎస్ 2015 జనవరి 23 న కన్నుముశాడు .

English summary

Popular Comedian M.S.Narayana died on January 23rd in 2015 year. Today was his death aniverssary.He Had acted almost 700 films