ఆమె మృతిపై లైవ్ డిమాన్ స్ట్రేషన్

Death Mystery Of Devi Reddy

10:50 AM ON 6th May, 2016 By Mirchi Vilas

Death Mystery Of Devi Reddy

హైదరాబాద్ జర్నలిస్టు కాలనీలో చెట్టును కారు ఢీకొన్న ఘటనలో ఇంజనీరింగ్ విద్యార్థి దేవి మరణించింది.అయితే ఈమె మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవి యాక్సిడెంటల్ గా చనిపోలేదని ఆమెను హత్య చేసి యాక్సిడెంట్ గా చిత్రీకరిస్తున్నారని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. కారు నడిపిన భరతసింహారెడ్డితో అసలు తమ అమ్మాయికి పరిచయమే లేదని మృతురాలి పెద్దనాన్న చెప్పారు. రెండు నిమిషాల్లో ఇంట్లో ఉంటానంటూ ఫోన్ చేసిన దేవిని కారులోని హతమార్చారని ఆయన ఆరోపించారు. కారు నడిపిన భరతసింహారెడ్డికి చిన్న గాయం కూడా కాలేదని ఆయన అన్నారు. కారులో ఓ అమ్మాయి, అబ్బాయి గొడవ పడినట్లు తాను గమనించానని అక్కడే ఉన్న వాచ్ మెన్ తెలిపాడు. ఈ రకరకాల వాదనల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు గురువారం లైవ్ డిమాన్ స్ట్రేషన్ చేశారు. ఓ కారుని తీసుకొచ్చి చెట్టుకి గుద్దించి కేసును కూపీలాగేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఈ ఘటన లో వాస్తవాలు వెలుగు చూసేనా!

ఇవి కూడా చదవండి: ప్రేమించడంలేదని రెండు చేతులు నరికేశాడు

ఇవి కూడా చదవండి:‘కాబిల్’ శాటిలైట్ రైట్స్ 45 కోట్లట!

ఇవి కూడా చదవండి:వావ్..శృతి పెళ్లి చేసుకుందా..?

English summary

Recently an Engineering Student Devi Reddy was died in an Accident and now police were investigating this case to know the truth behind this accident mystery.