స్మార్ట్‌ఫోన్‌ల జోరు తగ్గిందా

Decrease In Smart Phone Usage

12:26 PM ON 5th December, 2015 By Mirchi Vilas

Decrease In Smart Phone Usage

ప్రతీ ఒక్కరి చేతిలో తప్పనిసరిగా ఉండే వస్తువుల్లో స్మార్ట్‌ఫోన్‌ చేరింది. కంప్యూటర్‌ను తోసిరాజని స్మార్ట్‌ఫోనల ప్రాబల్యం విపరీతంగా పెరిగిపోయిన వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిందే. స్మార్ట్‌ఫోన్‌తోనే రోజువారీ కార్యకలాపాలను నిర్వర్తించుకునేందుకు వీలు చిక్కింది. అయితే తాజాగా వెల్లడైన ఒక పరిశీలన ప్రకారం స్మార్ట్‌ఫోన్ల జోరు తగ్గిందట. మార్కెట్‌ రీసెర్చి సంస్థ ఐడిసి అధ్యయనం ప్రకారం ఇబ్బడిముబ్బడిగా అమ్ముడుపోయిన స్మార్ట్‌ఫోన్ల వ్యాపారం 2015లో కుంటుపడిందట. గడచిన దశాబ్ధం వరకూ రెండెంకల వృద్ధి సాగించిన స్మార్ట్‌ఫోన్ల వ్యాపారం ఈ ఏడాది మాత్రం ఒక అంకె వృద్ధిని దాటడానికి కష్టపడుతుందట. వందకోట్లకుపైగా స్మార్ట్‌ఫోన్లను ఈ ఏడాది వినియోగదారులకు సరఫరా చేసినప్పటికీ ఇది కేవలం 9.8శాతమేనట. గణాంకాల ప్రకారం చూస్తే ఆసియా పసిఫిక్‌, పశ్చిమ యూరప్‌ దేశాలలో స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయట.

భవిష్యత్తులో స్మార్ట్‌ఫోన్ల మార్కెట్‌ మరింత తగ్గే అవకాశాలు లేకపోలేదని నివేదికలు చెబుతున్నాయి. విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఫోన్‌లతో పోల్చితే ఆండాయిడ్‌, యాపిల్‌ ఐఒఎస్‌ ఫోన్ల హవా కొనసాగుతుందట. ఈ పరిస్థితులకు మూల కారణంగా చైనానే చూపిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడవ వంతు స్మార్ట్‌ఫోన్ల సరఫరా దారుగా ఉన్న చైనాలో వస్తున్న మార్పుల కారణంగానే ఈ పరిస్థితి వచ్చిందట. ఇప్పటికే ప్రంచం మొత్తానికి తమ ఫోన్లను అమ్మేసిన చైనాకు కొత్త కొనుగోలు దారులు కనిపించకపోవడమే అసలు కారణం. అవసరానికి మించిన స్థాయిలో ఫోన్లు అమ్ముడుపోయాయి. ఇక కొత్త మార్కెట్‌లకు స్థానం లేకపోవడంతో చైనాలో మార్కెట్‌ వృద్ధి స్థంభించిపోయిందట.

ఈ తరహా మాంధ్యంను తరిమికొట్టేందుకు పరిశీలకులు కొన్ని సలహాలను ఇస్తున్నారు. చౌక ధరలకు స్మార్ట్‌ఫోన్లను అందించడం ద్వారా మళ్ళీ మంచి వృద్ధిని పొందవచ్చనేది విశ్లేషకుల అభిప్రాయం. అలాగే పాత ఫోన్లను పరిమిత ధరకే అప్‌గ్రేడ్‌ చేయడం వంటి కొత్త స్కీమ్‌లతో కూడా కొత్త ఫోన్ల అమ్మకాలను పెంచవచ్చట. ఇప్పటికే యాపిల్‌ కొత్త కొత్త మోడల్స్‌ను మార్కెట్‌లోకి వదులుతూనే, పాత ఫోన్‌లకు అప్‌గ్రేడ్‌ సౌకర్యాన్ని అందిస్తోంది. ఇదే తరహా వ్యాపార ధోరణిని అన్ని కంపెనీలు అవలంభిస్తే ఈ స్మార్ట్‌ఫోన్‌ల అమ్మకాలలో మళ్ళీ రెండెంకల వృద్ధి చూసే వీలుంటుందట.

English summary

Today smart phones became a essential thing in everyone's life for past few years smart phone sales were gone high. A news research by market research firm IDC is predicting that there were slight decrease in smartphones sales when compared to previous years