తనకిచ్చిన బీఎండబ్ల్యూ కారు వెనక్కి ఇచ్చేస్తున్న దీప.. ఎందుకో తెలుసా?

deepa karmakar returning her BMW car

12:16 PM ON 13th October, 2016 By Mirchi Vilas

deepa karmakar returning her BMW car

ఎంతో అభిమానంగా గిఫ్ట్ ఇస్తే ఎవరైనా తిరిగి ఇచ్చేస్తారా పైగా ఆ గిఫ్ట్ గా వచ్చిన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు అయితే ఎవరైనా తిరిగి ఇచ్చేయాలనుకుంటారా..? అంతటి ఉదార హృదయం ఎవరికైనా ఉంటుందా..? కానీ నాకుంది అంటోంది ఒలంపిక్స్ విజేత అయిన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్.. ఒలంపిక్స్ జిమ్నాస్టిక్స్ లో మంచి టాలెంట్ చూపి పతకం సాధించిన దీపా.. క్రికెటర్ సచిన్ చేతులమీదుగా తనకు అందిన బీఎండబ్ల్యూ కారును వాపసు చేయాలని నిర్ణయించుకుందట. ఈ వాహనాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నానని, తన సొంత రాష్ట్రం అగర్తలలోని రోడ్లపై దీన్ని తిప్పడం సాధ్యం కాదని దీపా భావిస్తున్నట్టు తెలిసింది. ఎందుకంటే, అక్కడ రోడ్లపై ఎక్కువగా గుంతలు, ఎత్తుపల్లాలు ఉంటాయి..

ఇలాంటి అధ్వాన్నపు రోడ్లపై బీఎండబ్ల్యూ వంటి వాహనాలను నడిపితే అవి దెబ్బ తింటాయి.. పైగా మా దగ్గర ఈ వాహన సర్వీసు సెంటర్ కూడా లేదు అని ఆమె వాపోయినంత పని చేసిందని సమాచారం. ఈ విషయాన్ని ఆమె కోచ్ బిశ్వేశ్వర్ నంది స్వయంగా తెలిపారు. దీపా అశక్తతను చాముండేశ్వరీ నాథ్ కు తెలియజేయగా.. ఇబ్బందేమీ లేదని, ఆమె కారును వాపసు చేసినా దాని ఖరీదు చేసే సొమ్మును ఆమె బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్పారని ఆయన వెల్లడించాడు. అంటే నిత్య నరకాన్ని తలపించే రోడ్లు అక్కడ ఉన్నాయన్న మాట. గత సెప్టెంబరులో పీవీ సింధు, దీపా, సాక్షి మాలిక్ లకు సచిన్ చేతులమీదుగా చాముండేశ్వరీ నాథ్ బీఎండబ్ల్యూ కార్లను అందజేసిన సంగతి తెలిసిందే.

English summary

deepa karmakar returning her BMW car