మాజీ ప్రియుడా , తాజా ప్రియుడా - దీపిక డైలమా

Deepika In Deep Confusion On Her Next Movie

10:33 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Deepika In Deep Confusion On Her Next Movie

ప్రియాంక చోప్రా తర్వాత హాలీవుడ్‌ బాట పట్టిన నటి ఎవరంటే, పొడుగు కాళ్ల సుందరి దీపికా పదుకొణె అని చెప్పవచ్చు. హాలీవుడ్‌ స్టార్‌ విన్‌ డీజిల్‌తో ‘ట్రిపుల్‌ ఎక్స్‌’ సినిమాలో నటిస్తోన్న ఈమె ప్రస్తుతం బాలీవుడ్‌లో సినిమాలకు ఓకే చెప్పడానికి డైలమాలో పడిందట. ఎందుకో ఓ సారి వివరాల్లోకి వెళ్ళాల్సిందే.

ఇవి కూడా చదవండి : ప్రత్యూష గురించి రేణు రహస్యాలు

హాలీవుడ్‌ చిత్రం షూటింగ్‌ మధ్యలో విరామం దొరకటంతో ఇటీవల ముంబయికి వచ్చింది దీపిక. ఈ గ్యాప్‌లోనే బాలీవుడ్‌లో తదుపరి సినిమాలపై ప్లాన్‌ చేస్తోంది. అయితే.. ఒక సినిమాలో నటించేందుకు మాజీ ప్రియుడు రణ్‌బీర్‌ కపూర్‌తో చర్చించిందట. అదే సమయంలో మరో ప్రముఖ దర్శకుడి నుంచి కూడా ఆఫర్‌ వచ్చిందట. అందులో దీపిక ప్రస్తుత ప్రియుడు రణ్‌వీర్‌సింగ్‌ హీరో అంట. దీంతో దీపిక పరిస్థితి అగమ్య గోచరంలో పడింది. మాజీ ప్రియుడు రణ్‌బీర్‌.. ప్రస్తుత ప్రియుడు రణ్‌వీర్‌ సింగ్‌లతో వేరువేరుగా నటించే అవకాశాలు దీపిక కు రావడంతో ఏమిచేయాలో పాలుపోవడం లేదట. అయితే.. ప్రస్తుతం ‘ట్రిపుల్‌ ఎక్స్‌’ సినిమా షూటింగులతో ఉన్న దీపికకి బాలీవుడ్‌లో ఒక్క సినిమాలో నటించే సమయమే ఉందట. దీంతో రణ్‌వీర్‌ సింగ్‌ సినిమా ఒప్పుకోవాలా..? రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాలో నటించాలా..? అని డైలమాలో పడిందట. చివరికి ఈ అమ్మడు ఎవరి సినిమాకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తుందో త్వరలో తేలుతుంది.

ఇవి కూడా చదవండి :

నా దగ్గర డబ్బుల్లేవ్ .. నెల గడవడమే కష్టంగా వుంది

హడావుడే ‘సర్దార్’ కి శాపంగా మారిందా?

ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

English summary

Bollywood Glamours Queen Deepika Padukone was presently acting in XXX movie in Hollywood and now she planning to do Bollywood movie along with that but she was in deep confusion that whether to act with her Ex- Boy Friend Ranbeer Kapoor and Present Boy Friend Ranveer Singh