దీపికా పదుకొనే-రణవీర్ ల నిశ్చితార్ధం అయిపోయింది

Deepika Padukone and Ranveer Singh engagement was completed

05:19 PM ON 8th July, 2016 By Mirchi Vilas

Deepika Padukone and Ranveer Singh engagement was completed

బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే, బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కొంత కాలం నుండి లవ్ లో వున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వీరిద్దరి నిశ్చితార్థం అయిపోయిందన్న ఓ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. దగ్గరి బంధువులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఉంగరాలు మార్చుకున్నారని, ఇక పెళ్లి తేదీయే ఖరారు చెయ్యాలని సమాచారం. అయితే.. ప్రస్తుతం ఇద్దరి చేతినిండా పలు సినీ ప్రాజెక్టులు ఉండటంతో.. పెళ్లికి మాత్రం మరింత సమయం పడుతుందని తెలుస్తుంది. వీరిద్దరి కెరీర్ ప్రస్తుతం పీక్ దశలో ఉన్న కారణంగా.. వివాహబంధం తమ భవిష్యత్తుకు ఇబ్బంది కలిగించవచ్చని అటు రణవీర్, ఇటు దీపికా భావిస్తున్నట్టు సమాచారం.

అయితే.. ఈ విషయంలో వీరిద్దరిలో ఎవరూ నోరు మెదపట్లేదు. నిశ్చితార్ధం జరిగిపోయినట్టు వస్తున్న వార్తలపై ఈ జంట ఏమంటుందో? ఇదిలా ఉంటే గతంలో రణవీర్ ముందు నగ్నంగా ఉన్నా.. నేను చాలా ఫ్రీ గా ఉంటానని దీపికా పదుకొనే చెప్పిన విషయం తెలిసిందే.

English summary

Deepika Padukone and Ranveer Singh engagement was completed