దీపికా హాలీవుడ్‌ ఎంట్రీ కన్‌ఫార్మేనా?

Deepika Padukone confirmed as a heroine in hollywood movie

12:21 PM ON 8th December, 2015 By Mirchi Vilas

Deepika Padukone confirmed as a heroine in hollywood movie

బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ దీపికా పదుకొనే హాలీవుడ్‌ లో నటించబోతుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం దీపికా హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ సిరీస్‌ త్రిబులెక్స్‌ రిటర్న్స్‌ లో నటించబోతుంది. త్రిబులెక్స్‌లో హీరోగా నటించిన విన్ డీజిల్‌, ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌ సిరీస్‌లో కూడా హీరోగా నటించాడు. ఈ సిరీస్‌ చిత్రాలతోనే విన్‌ డీజిల్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు. అయితే హాలీవుడ్‌ ఫిలిం మేకర్స్‌ ఈ మధ్య సౌత్‌ ఆసియా మార్కెట్‌ పై కూడా కన్నెసింది. అందువల్లే మన ఇండియన్‌ యాక్టర్స్‌కి హాలీవుడ్‌లో ఛాన్స్‌ ఇస్తుంది.

ఇంతక ముందు బాలీవుడ్‌ యాక్టర్స్‌ అయిన ఇర్ఫాన్‌ఖాన్‌, అనీల్‌ కపూర్‌, ఐశ్వర్యరాయ్‌, టబు, ప్రియాంక చోప్రా హాలీవుడ్‌లో నటించిన వాళ్లే. తాజాగా దీపికా పదుకొనే కూడా ఈ జాబితాలోనికి చేరింది. అయితే దీపికాని ఇంకా త్రిబులెక్స్‌లో కన్ఫర్మ్ చేయ్యలేదు. అందుకోసమే దీపికా అమెరికా వెళ్లింది. అక్కడే సినిమా కన్ఫర్మ్ చేసుకుని ఇండియాకి వస్తుంది.

English summary

Deepika Padukone confirmed as a heroine in hollywood movie XXX returns. She is acting with Hollywood super star hero Vin Diesel.