రణవీర్‌ సింగ్‌ను అనుకరిస్తున్న దీపికా

Deepika Padukone following fashion of Ranveer Singh

06:41 PM ON 20th November, 2015 By Mirchi Vilas

Deepika Padukone following fashion of  Ranveer Singh

హిందీ చలన చిత్రాల సీమలో నటించి బాగా పేరు పొంది తనదైన రీతిలో బాలీవుడ్‌ లో ముద్రవేసుకున్న ముద్ధుగుమ్మ దీపికాపదుకునే. దీపికా పదుకునే రణవీర్‌సింగ్‌ నటించిన చిత్రం రామ్‌లీలా అప్పటినుండి నుండి వీరిద్ధరు ప్రేమలో మునిగి తేలుతున్న విషయం అందరికి తెలిసిందే. దీపికా ప్రియుడు రణవీర్ సింగ్ బాలీవుడ్‌ పరిశ్రమలోనే దారుణమైన వస్త్రధారణ కలిగిన వారని అక్కడి వారి అభిప్రాయం. ఇప్పుడు అలాంటి విచిత్రమైన వస్త్రధారణలను దీపికా కూడా అనుకరిస్తుంది.

ఇటీవల జరిగిన 'తమాషా' సినిమాకి సంభందించిన ఈవెంట్‌కి దీపిక ప్రత్యేక అతిధిగా విచ్చేశారు. ఆ ఈవెంట్‌కి తన ప్రియుడు రణ్ వీర్ సింగ్ వేషదారణలో దీపికా కనిపించింది. ఆ వస్త్రాధారణ ఎలా ఉందంటే మోకాళ్ళ దగ్గర చిరిగిపోయిన డెనిమ్‌ ఫ్యాంట్ తో దానికి సరిపోయే షర్టు తో దర్శనమిచ్చింది . దాన్ని చూసిన వారంతా దీపిక రణవీర్‌ ను అనుకరిస్తుందని అభిప్రాయ పడ్డారు. ఇప్పుడు బాలీవుడ్‌ లో ఇది హాట్‌టాఫిక్‌ గా మారింది.

English summary

Ranveer Singh is known for his outrageous dressing sense and it seems that his alleged girlfriend Deepika Padukone too has taken a leaf out of her boyfriend's style book.