హాలీవుడ్‌ లో దీపికా ఎంట్రీ?

Deepika Padukone giving entry in Hollywood?

01:21 PM ON 7th December, 2015 By Mirchi Vilas

Deepika Padukone giving entry in Hollywood?

రణబీర్‌ కపూర్‌, దీపికా పదుకొనే నటించిన తాజా చిత్రం 'తమాషా' ఇటీవలే విడుదలై యావరేజ్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. అయితే దీపికా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వబోతుందన్న వార్తలు హల్‌చల్‌ చేస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు, 'ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌' సిరీస్‌ల హీరో 'విన్‌ డీజిల్'ను కౌగిలించుకుని దిగిన ఫోటేనే దీనికి కారణం. దీపికా తన ట్విట్టర్‌ ద్వారా పోస్ట్‌ చేసిన ఆ ఫోటో వెనుకాల త్రిబులెక్స్‌ పోస్టర్ ఉండటమే దీనికి కారణం. అయితే విన్‌ డీజిల్‌ కూడా త్రిబులెక్స్‌ రిటర్న్స్లో నటించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు రావడంతో దీపికా హాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తుందన్న వార్తలు నిజమే అని తెలుస్తుంది.

అయితే ఇడి నిజమో కాదో తెలియాలంటే దీపికా నోరు విప్పాల్సిందే.

English summary

The rumours is spreading about Deepika Padukone that she is giving entry in Hollywood with Hollywood hero Vin Diesel.