కండలు పెంచే పనిలో

Deepika Padukone Gym Workout

12:02 PM ON 3rd February, 2016 By Mirchi Vilas

Deepika Padukone Gym Workout

సినిమా అంటే మాటలా ... ఏ పాత్ర అంటే ఆపాత్రలో ఓడిగిపోవాలి , రొమాన్స్ పండించడం ఒక్కటే కాదు అవసరమైతే ఖంగు తినిపించేలా భామలు మారపోవాలి . ఇందుకోసం మగ హీరోలే కాదు హీరోయిన్స్ కూడా కండలు పెంచాల్సిందే. అందుకే ‘పీకూ’, ‘బాజీరావ్‌ మస్తాని’ లాంటి పాత్రలతో ఆకట్టుకున్న దీపికా పడుకొనే ఇప్పుడు కండలు పెంచే పని లో పడింది.ఇందుకోసం చెమటలు చిందిస్తోంది. ఇదంతా ఎందుకంటే ‘ట్రిపుల్‌ ఎక్స్‌: ది రిటర్న్‌ ఆఫ్‌ జాండర్‌ కేజ్‌’ అనే హాలీవుడ్‌ సినిమాకు ఎంపికైన నేపధ్యంలో కసరత్తు స్టార్ట్ చేసేంది. శిక్షకుల పర్యవేక్షణలో శ్రమిస్తోంది. హాలీవుడ్‌ సినిమా అంటే మాటలా? పైగా యాక్షన్‌ హీరోగా పేరుపడిన విన్‌ డీజిల్‌ సరసన కనిపించే పాత్ర కావడంతో బుగ్గలు సొట్టలు పడే నవ్వుతోను, హుషారుగా స్టెప్పులేసే నాట్యాలతోను సరిపెట్ట దానికి కుదరదుగా. హీరోతో సమానంగా యాక్షన్‌ సన్నివేశాల్లో రెచ్చి పోవాలంటే, కండలు పెంచాల్సిందే. అందుకే దీపికా తపనంతా దీనిపైనే. ఇక వేరే ధ్యాస లేదు పాపం. ఈ కొత్త పాత్రలో ఒదిగిపోడానికి సున్నితమైన నాజూకు శరీరాన్ని రాటు దేలేలా చేయడానికి గంటల తరబడి తెగ కష్టపడుతోంది. తెల్లవారుజామునే లేచి జిమ్‌కి వెళ్లి, సన్నని చేతులతో బరువులు ఎత్తేస్తోంది. ప్రత్యేకమైన వ్యాయామాల కోసం పెట్టుకున్న శిక్షకురాలు అయిన ప్రముఖ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ యాశ్మిన్‌ కరాచివాలా ఏం చెబితే అది చేసేయ్యడంతో పాటూ ఆమె ఏం తినమంటే అదే తింటోంది దీపికా. కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్‌, ఫైబర్‌లతో కూడిన ఆహారాన్ని ప్రతి రెండు గంటలకొకసారి అందిస్తున్నారట. ఇక డి.జె.కరుసో దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా చిత్రీకరణ మంగళవారం మొదలైంది. ఇక ఓ మూడు నెలల పాటు దీపికా ఈ చిత్రీకరణలో గడపాల్సి వస్తుంది మరి. ఇక ఇరగదీయడమే తరువాయి అంటున్నారు ఆమె అభిమానులు.

English summary

Bollywood Top Heroine Deepika Padukone recently gets a chance in a Holllywood Moive Named "XXX". In this movie Deepika was acting with the Hollywood's action Hero Vin Diesel. For this film Deepika Pudukone growing her muscles qand doing workouts in Gym with a personnel futness trainer