రేటు పెంచేసిన 'పద్మావతి'

Deepika Padukone increased her remuneration for Padmavathi movie

03:12 PM ON 29th July, 2016 By Mirchi Vilas

Deepika Padukone increased her remuneration for Padmavathi movie

ఓ రేంజ్ వస్తే, ఇక వెనుకా ముందూ ఆలోచించకుండా దీపం ఉండగానే ఇల్లు చక్క బెట్టేసుకోవాలన్న రీతిలో వ్యవహరిస్తారు. ఇక బాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలుగొందిన దీపికా పదుకొనే పరిస్థితి అలానే వుంది. ప్రస్తుతం హాలీవుడ్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్న ఈ అమ్మడు హాలీవుడ్ కండల వీరుడు విన్ డీజిల్ హీరోగా తెరకెక్కుతున్న త్రిబులెక్స్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే, హాలీవుడ్ లో నటించినా బాలీవుడ్ ని మాత్రం వదిలిపెట్టలేదు. చారిత్రక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందిస్తున్న పద్మావతి సినిమాకు దాదాపు రూ.12కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోందట.

హాలీవుడ్ సినిమా తర్వాత దీపికా చేస్తున్న తొలి బాలీవుడ్ చిత్రం కావడంతో ఈ సినిమానుంచే రెమ్యునరేషన్ పెంచాలని ఈ బ్యూటీ ఆలోచిస్తోందట. దీనిలో భాగంగానే పద్మావతికి అంత భారీ స్థాయిలో ముట్టజెప్పాలని అడుగుతోందట. ఇప్పటికి వరకు బాలీవుడ్ లో దీపికా పదికోట్ల లోపు మాత్రమే పారితోషికంగా తీసుకుంది. ఇప్పుడు ఏకంగా దీన్ని రూ. 12కోట్లకు పెంచడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు దీనిపై ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. పైగా దీపికా డిమాండ్ చేస్తున్న రేటు.. బాలీవుడ్ యంగ్ జనరేషన్ హీరోల పారితోషికం కంటే కూడా చాలా ఎక్కువని, తమ సినిమాల్లో దీపికకు బదులు వేరే హీరోయిన్స్ ను తీసుకొని బండి నడిపించాలని నిర్మాతలు ఆలోచిస్తున్నారట.

English summary

Deepika Padukone increased her remuneration for Padmavathi movie