దీపికా పదుకొనే సిక్స్ ప్యాక్!

Deepika Padukone is trying for six pack

11:01 AM ON 17th June, 2016 By Mirchi Vilas

Deepika Padukone is trying for six pack

బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకొనే టైం ఇప్పుడు బాగా నడుస్తుంది. వరుసపెట్టి హిట్లు కొడుతూ కెరీర్లో దూసుకుపోతుంది. దానికి తోడు ఈ అమ్మడు హాలీవుడ్ లో కూడా ఛాన్స్ కొట్టేసింది. హాలీవుడ్ స్టార్ హీరో విన్ డీజిల్ సరసన త్రిబులెక్స్ చిత్రంలో నటిస్తుంది. ఇప్పుడు ఈ చిత్రం కోసం ఆ అమ్మడు గట్టిగా శ్రమిస్తుంది. ఆ వివరాల్లోకి వెళితే.. సిక్స్ ప్యాక్ లు ట్రై చేసేది హీరోలేనా? మేం ట్రైచేయలేమా అనుకుందో ఏమో కానీ దీపికా పదుకొనే సిక్స్ ప్యాక్ కోసం తెగ కష్టపడుతోంది. దీపికా హాలీవుడ్ కి వెళ్ళి అక్కడ సినిమాలు చేయడం ప్రారంభించాక అక్కడివారిలాగా ఆలోచించడం మొదలు పెట్టింది అంటున్నారు బాలీవుడ్ జనాలు.

హాలీవుడ్ హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా సిక్స్ ప్యాక్ లు పెంచేసి ఫైటింగ్లు గట్రా చేసేస్తుంటారు. ఇప్పుడు దీపికా కూడా వారిని చూసి తనూ అలా తయారవ్వాలని జిమ్ లో కష్టపడుతోందని చెబుతున్నారు. సన్నగా నాజూకుగా ఉండే దీపికను ఇప్పుడు సిక్స్ ప్యాక్ లో చూడగలమా? అన్న అనుమానాన్ని పలువురు వ్యక్తం చేస్తున్నారట కూడా.. ఆరుపలకల దేహంతో దీపికా మెప్పిస్తే.. సిక్స్ ప్యాక్ చేసిన తొలి హీరోయిన్ గా రికార్డు సృష్టించడం ఖాయం.

English summary

Deepika Padukone is trying for six pack