దీపికా 'త్రిబులెక్స్‌' ఫస్ట్‌లుక్‌

Deepika Padukone XXX first look

04:27 PM ON 5th February, 2016 By Mirchi Vilas

Deepika Padukone XXX first look

బాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్‌ హీరోయిన్‌గా వెలిగిపోతున్న హీరోయిన్‌ దీపికా పదుకునే. తన నటన, అందంతో ఆకట్టుకున్న దీపికా హాలీవుడ్‌లో కూడా ఛాన్స్‌ కొట్టేసింది. హాలీవుడ్‌లో సూపర్‌హిట్‌ సీరీస్ అయిన త్రిబులెక్స్‌ చిత్రంలో నటించే అవకాశం దక్కించుకుంది. దీపికా హాలీవుడ్‌ భామలకు థీటుగా కనిపించేందుకు జిమ్‌లో కసరత్తులు కూడా చేసింది. ఫాస్ట్‌ అండ్‌ ఫ్యూరియస్‌, త్రిబులెక్స్‌ వంటి చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నటుడు విన్‌ డీజిల్‌ సరసన దీపికా నటిస్తుంది. ఇప్పటికే ఘాటింగ్‌ మొదలైన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. ఫుల్‌ యాక్షన్‌ ప్యాక్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విన్‌ డీజిల్‌కు సరిపడేలా దీపికా ఉంది. ఈ ఫస్ట్‌లుక్‌ ని మీరు ఒక లుక్‌ వెయ్యండి.

English summary

Bollywood hot beauty got chance to act in hollywood movie. She got a chance in hollywood super hit series XXX movie. Now here is the first look of Deepika Padukone in XXX movie.