'జెట్లీ'తో దీపికా జోడీ!!

Deepika pairing with Jet Li

12:02 PM ON 7th January, 2016 By Mirchi Vilas

Deepika pairing with Jet Li

బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే హాలీవుడ్‌ ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వినబడిన విషయం తెలిసిందే. అయితే ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు. హాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌ అయిన 'త్రిబులెక్స్‌' చిత్రంలో విన్‌ డీజిల్‌ సరసన నటించబోతుందని త్రిబులెక్స్‌ నిర్మాతలు అధికారికంగా కాస్ట్‌ని రెండు రోజుల క్రితం విడుదల చేశారు. దీనితో హాలీవుడ్‌లో దీపికా ఎంట్రీ కన్ఫర్మ్‌ అని తేలిపోయింది. అయితే ఈ కాస్టింగ్‌ లో మరో ఇంటర్నేషనల్‌ స్టార్‌ పేరు కూడా ఉండడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సౌత్‌ ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ నటిస్తున్న తాజా చిత్రం 'కబాలి' చిత్రంలో తైవాన్‌ స్టార్‌ హీరో జెట్లీని విలన్‌గా నటింపజేయాలని భావించారు.

అయితే జెట్లీ అందుకు నిరాకరించడంతో అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కాస్టింగ్‌లో జెట్లీ పేరు ఉండడంతో అందరూ ఖంగు తిన్నారు. 'కబాలి' కేవలం ఇండియన్‌ సినిమా మాత్రమే, త్రిబులెక్స్‌ ఇంటర్నేషనల్‌గా రూపొందే హాలీవుడ్‌ చిత్రం కావడంతో జెట్లీ ఈ చిత్రంలో చెయ్యడానికి అంగీకరించి ఉంటాడని భావిస్తున్నారు.

English summary

Deepika pairing with Jet Li in XXX movie.