పుణె ఓటమి ఓ వార్నింగ్: గవాస్కర్‌

Defeat was a wake-up call Says Gavaskar

12:00 PM ON 11th February, 2016 By Mirchi Vilas

Defeat was a wake-up call Says Gavaskar

శ్రీలంకతో తొలి టీ20 మ్యాచ్‌లో ఓటమి టీ20 ప్రపంచకప్‌ ముంగిట టీమిండియాకు ఓ వార్నింగ్ బెల్ అని మాజీ క్రికెటర్‌ సునీల్‌ గవాస్కర్‌ అభిప్రాయపడ్డారు. శ్రీలంక అరంగేట్రం బౌలర్‌ కసున్‌ రజిత తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లు తీసి భారత్‌ను దెబ్బతీశాడన్నారు. ఈ దశలో క్రీజులో ఉన్న ధావన్‌, రైనా వికెట్‌ కాపాడుకోవడం కంటే భారీ షాట్లతో పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించారని గుర్తు చేశారు. పిచ్‌ నుంచి సహకారం లభించడంతో శ్రీలంక యువ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్‌ చేసి భారత్‌ను 101 పరుగులకే కట్టడి చేయగలిగారని, అయితే తొలి ఓవర్‌లోనే రెండు కీలక వికెట్లు కోల్పోవడం కూడా భారత్‌ను దెబ్బతీసిందన్నారు. టీమ్‌ ఇండియా బలహీనతలు సరిదిద్దుకునేందుకు ఇదే సరైన సమయమని.. మిగిలిన రెండు టీ20ల్లో సత్తాచాటి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకోవాలని గవాస్కర్‌ సూచించారు.

English summary

Indian Veteran player Sunil Gavskar says that Defeat to Sri Lanka Will Serve as Wake Up Call For India, Says Sunil Gavaskar.Every one have to play well for the sake of win