‘రియల్ బీస్ట్’ రాక ఆలస్యం..

Delay on realease of real beast micromax phone

05:26 PM ON 3rd December, 2015 By Mirchi Vilas

Delay on realease of real beast micromax phone

తక్కువ ధర ఎక్కువ ఫీచర్లతో భారత యువతను ఆకట్టుకున్న మైక్రోమాక్స్ అనుబంధ సంస్థ 'యు’ తన తరువాతి ఫ్లాగ్‌షిప్ ఫోన్ 'యుటోపియా'ను త్వరలో మార్కెట్ల్ లోకి తీసుకురానుంది. వాస్తవానికి ఈ నెల 7నే ఈ ఫోన్ ను భారత మార్కెట్లో లాంచ్ చేసేందుకు యు రంగం సిద్ధం చేసుకుంది. 'ద రియల్ బీస్ట్ రాబోతోందంటూ' ఆహ్వాన ప్రతులను కూడా పంచింది. అయితే అనివార్య కారణాల వల్ల బీస్ట్ రాక ఆలస్యమవుతోందని మైక్రోమాక్స్ సహవ్యవస్థాపకులు రాహుల్ శర్మ ట్విట్టర్లో వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 18నే యు తన తొలి స్మార్ట్ ఫోన్ యురేఖాను మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.

తమ యుటోపియా ఫోన్‌ను ప్లానెట్‌లోనే శక్తివంతమైన ఫోన్‌గా రాహుల్ శర్మ అభివర్ణించారు. ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి.. 5.2 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 2560 x 1440పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 4జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, స్నాప్‌డ్రాగన్ 810 64 బిట్ 1.5 ఆక్టా‌కోర్ ప్రాసెసర్, అడ్రినో 430 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 21 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 4జీ కనెక్టువిటీతో పాటు క్వాల్ కామ్ క్విక్ చార్జ్ ఫీచర్ కూడా ఉంది. పూర్తి మెటల్ బాడీతో రూపుదిద్దుకుంటున్న మొదటి యు ఫోన్ ఇదే కానుంది.

English summary

Micromax's affiliciatory company yu is announced that the company is going to release its new phone called yu yutopia in india, but due to some reasons the release of its phone was stopped said by micromax co-founder rahul sharma in twitter