ఆసియాలో బెస్ట్ షాపింగ్ స్పాట్ ఢిల్లీ

Delhi As Asia's Best Shopping Spot

05:29 PM ON 15th December, 2015 By Mirchi Vilas

Delhi As Asia's Best Shopping Spot

దేశ రాజధాని ఢిల్లీ మరో అరుదైన ఘనతను సాధించింది. చారిత్రక కట్టడాలతో పర్యాటక నగరంగా పేరుగాంచిన ఢిల్లీ.. సియాలోనే బెస్ట్ షాపింగ్ స్పాట్ గా నిలిచింది. రకరకాల మోడళ్లు, బోలెడన్ని షాపింగ్ మాల్స్ తో కస్టమర్లను ఆకట్టుకోవడంలో ఢిల్లీ ముందుందని ట్రిప్ అడ్వైజర్ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. షాపింగ్ పాపులారిటీ, స్టార్ హోటళ్ల నిర్వహకుల సలహాలు, కమర్షియల్ షాపింగ్ ప్రోగ్రామ్స్ ఆధారంగా షాపింగ్ లో టాప్ నగరాల లిస్ట్ ప్రిపేర్ చేసినట్టు సర్వే నిర్వాహకులు చెప్పారు. టాప్ నగరాల జాబితాలో ఢిల్లీ తరువాత బ్యాంకాక్, సింగపూర్, బీజింగ్, హనోయ్, టోక్యో, సియోల్, కౌలాలంపూర్, ఖాట్మండు, జకార్తా నిలిచాయి. మరోవైపు మంచి షాపింగ్ ప్రదేశాలు, క్వాలిటీకి తగ్గ కాస్ట్ తెలిస్తే చాలు… ఆసియా నగరాల్లో షాపింగ్ చాలా ఈజీ అంటున్నారు మార్కెట్ నిపుణులు. బ్రాండెడ్ షాపులతో పాటు, డిజైనరీ ఐటమ్స్ కు ఆసియా మార్కెట్సే బెటరంటున్నారు. కాస్ట్ అండ్ క్వాలిటీ తెలిస్తే చాలు ఈజీగా కొనెయొచ్చని సలహా ఇస్తున్నారు.

English summary

New Delhi has stand in first place in the list of Asia's top cities for shopping , according to a new survey.