అవును మండపానికి పెళ్లికూతురు ఇలా వచ్చింది

Delhi Bride Enters Into Mandap In A Different Way

10:53 AM ON 27th December, 2016 By Mirchi Vilas

Delhi Bride Enters Into Mandap In A Different Way

పెళ్లంటే, నూరేళ్ళ పంట. పెళ్ళికి ఇచ్చే ప్రయారిటీ గురించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే, ఎవరైనా తమ పెళ్లిని తమకున్నంతలో అంగరంగ వైభవంగా, భిన్నంగా చేసుకోవాలనుకుంటారు. మరికొంతమంది పెళ్లిలో భాగంగా సంగీత్, మెహందీ, బరాత్ లాంటి రకరకాల వేడుకలు నిర్వహిస్తారు. ఆ వేడుకల్లో జనం ఆడుతూ పాడుతూ గడిపేస్తారు. డ్యాన్స్ లు చేస్తూ ఊగిపోయేవాళ్లూ ఉంటారు. ఇక్కడా అలాంటిదే జరిగింది. కాకపోతే ఇక్కడ కాస్త డిఫరెంట్ గా. పెళ్లి మండపానికి పెళ్లికూతురు డిఫరెంట్ గా వచ్చింది. అదేమిటి అంటే, స్వయంగా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చింది. పైగా కారు దిగీ దిగగానే, నృత్యం చేస్తూ పెళ్లిమండపంలోకి వచ్చింది. ఇంతకీ పెళ్లి కూతురు ఒక్కతే కాదండోయ్.. తనకు తోడుగా ఉన్న తోడు పెళ్లికూతురు కూడా ఆమెతో జతకట్టింది. పెళ్లికూతరు ఉత్సాహం చూసి ఆ వేడుకను చూడటానికి వచ్చినవారు కూడా ఓ స్టెప్పేశారు. ఢిల్లీలో జరిగిన ఈ పెళ్లి వేడుక.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లికూతురు డ్యాన్స్ చేసిన వీడియో ఫేస్ బుక్, యూట్యూబ్ లో పెడితే కోటీ పది లక్షల మంది చూశారు. ఇంకా హల్ చల్ చేస్తూనే వుంది. మీరూ ఒలుక్కెయ్యండి.

ఇవి కూడా చదవండి: భూమిలాంటి మరో గ్రహం ఉందా?

ఇవి కూడా చదవండి: ఫేస్ బుక్ ప్రియులకు ఇక పండగే

English summary

A New Bride in Delhi ebnters into Kalyan Mandap in a different way and she used to dance and enters into the mandap and the guests over there were also got very excited with the dance of the bride and they were also used to dance over there.