నిర్భయకేసులో బాల నేరస్తుడి విడుదలకు రంగం సిద్ధం

Delhi Gang-Rape Convict To Be Released

12:08 PM ON 19th December, 2015 By Mirchi Vilas

Delhi Gang-Rape Convict To Be Released

మూడు సంవత్సరాల క్రితం ఢిల్లీ లోని పారామెడికల్‌ విద్యార్ధిని పై అతి దారుణంగా ఆరుగురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆమె చావుకు కారణమైన వారిలో ఒకరైన బాల నేరస్ధుడికి ఢిల్లీ హైకోర్టు మూడు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అయితే ఇప్పుడు అతని శిక్షాకాలం ముగియడంతో ఢిల్లీ హైకోర్టు అతనిని విడుదల చెయ్యాలని భావిస్తుండగా, ఆ బాలనేరస్థుడిని విడుదల ను ఆపాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టును అభ్యర్దించింది.

అయితే ఈ కేసు సంబంధించి జరిగిన వాదనలను విన్న ఢిల్లీ హైకోర్టు ప్రస్తుతం అబ్జర్వేషన్‌ హోంలో ఉన్న బాల నేరస్తుడి విడుదల పై స్టే ఇవ్వలేమని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. దీంతో ఇప్పుటి వరకు అబ్జర్వేషన్‌ హోం లో ఉన్న బాల నేరస్థుడిని ఈ నెల 20న విడుదలయే అవకాశాలున్నాయని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

English summary

Delhi Gang-Rape Convict Who was a minor boy To Be Released on december 20th. Yesterday delhi high court refused the request of central government that no to release that accused member from jail