ఢిల్లీ భామకు మిస్‌ ఇండియా కిరీటం

Delhi Girl Priyadarshini Wins Miss India Award

10:49 AM ON 11th April, 2016 By Mirchi Vilas

Delhi Girl Priyadarshini Wins Miss India Award

మొత్తానికి ఎఫ్‌బిబి ఫెమినా మిస్‌ ఇండియా కు సంబంధించి చివరి పోటీలు శనివారం రాత్రి ముంబయిలో ఘనంగా నిర్వహించారు. ఫైనల్‌కి చేరుకున్న 21 మంది అభ్యర్థుల్లో ఢిల్లీకి చెందిన ప్రియదర్శిని ఛటర్జీ మిస్‌ ఇండియా వరల్డ్‌- 2016 కిరీటాన్ని సొంతం చేసుకుంది. పలువురు బాలీవుడ్‌ నటీనటులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. షారుక్‌ ఖాన్‌ విజేత పేరు ప్రకటించారు. బెంగళూరుకి చెందిన సుశ్రుతి కృష్ణ మొదటి రన్నరప్‌గా నిలవగా, లఖ్‌నవూకి చెందిన పంఖుడి గిడ్వాని రెండో రన్నరప్‌గా నిలిచింది. పోటీదారుల దుస్తులను అంజు మోదీ, నమత్ర జోషిపుర, ఫాల్గుణి, షేన్‌ పీకాక్‌లు డిజైన్‌ చేశారు.

ఇవి కూడా చదవండి : ఈ దేశాల్లో మన రూపాయి చాలా రిచ్

ఈ సందర్భంగా ‘ఫ్యాన్‌’ చిత్రంలోని జబ్రా పాటకు నృత్యం చేసి షారుఖ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్‌ నటులు సంజయ్‌దత్‌, యామీ గౌతమ్‌, అర్జున్‌కపూర్‌, కబీర్‌ ఖాన్‌, అమీ జాక్సన్‌, 2015 మిస్‌ వరల్డ్‌ మిరేయా లలాగున, టెన్నిస్‌ స్టార్‌ సానియామీర్జా, దర్శక నిర్మాత ఏక్తాకపూర్‌, డిజైనర్లు మనీశ్‌ మల్హోత్ర, షేన్‌ పీకాక్‌లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. దర్శకుడు కరణ్‌జోహార్‌, మనీశ్‌ పాల్‌ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా ఉన్నారు. వరుణ్‌ధావన్‌, షాహిద్‌కపూర్‌, టైగర్‌ ష్రాఫ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ తమ నృత్య ప్రదర్శనలతో వీక్షకులను ఉర్రూతలూగించారు.

ఇవి కూడా చదవండి :

'శృతి' మించి అందాలు ఆరబోసింది(వీడియో)

మాజీ ప్రియుడా , తాజా ప్రియుడా - దీపిక డైలమా

English summary

Delhi Girl Priyadarshini Chatterjee Wins Miss India Award. This event was organised in Mumbai Yesterday.Shah Rukh Khan,Sania Mirza and few other actors were attended as chief guests to this event.