ఈ కామర్స్‌ సైట్ల పై నజర్‌

Delhi High Court asks govt to probe all 21 e-commerce sites

06:33 PM ON 21st November, 2015 By Mirchi Vilas

Delhi High Court asks govt to probe all 21 e-commerce sites

రోజురోజుకు కుప్పలుతెప్పలుగా పుట్టుకొస్తున్న ఈ-కామర్స్‌ వెబ్‌సైట్ల్‌ పై దర్యాప్తునకు ఢిల్లీ హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎప్పుటికపుకప్పుడు కొత్త కొత్త మార్గాలతో వ్యాపారాన్ని విస్తరించుకుపోతున్న ఈ-కామర్స్‌ సైట్ల పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

తాజాగా అఖిలభారత పాదరక్షల తయారిదారులు మరియు చిల్లర వర్తక సంఘం వారు ఈ కామర్స్‌ సైట్ల ఆగడాలను తెలియజేస్తూ ఢిల్లీ హైకోర్టు లో వేసిన పిటిషన్‌ను స్వికరించిన ధర్మానం అన్ని ఈ కామర్స్‌ సైట్లపై సమగ్ర దర్యాప్తు చేయ్యాల్సిందిగా ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనేక వాదనలు విన్న ఢిల్లీ ధర్మాసనం జడ్జీ జస్టీస్‌ రాజివ్‌ ఎండ్లా. నాలుగు వారాల్లో గా సమాధానం చెప్పాలని వాణిజ్య మంత్రిత్వశాఖ వారిని ఆదేశించింది.

గతంలో సీనియర్‌ న్యాయవాది ఏఏమ్‌ సింఘ్వీ కూడా ఈ-కామర్స్‌ సైట్లలో విదేశిప్రత్యక్ష పెట్టుబడులను అడ్డు కోవడానికి అనేక వాదనలు వినిపించారు. ఈ-కామర్స్‌ వెబ్‌సైట్లు ఆన్‌లైన్లో ఎఫ్‌డిఐ నిభంధనలకు విరుద్దంగా ఉన్నాయని చెప్పారు.

ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థలైన ఫిప్‌కార్ట్‌,అమెజాన్‌,స్నాప్‌డీల్‌ వంటి సైట్లు భారీ డిస్కౌంట్లను అందించడం వల్ల చిల్లర అమ్మకదారులపై తీవ్రమైన ప్రభావం పడుతుంది.

English summary

On a petition filed by the country's brick-and-mortar retailers through the All-India Footwear Manufacturers and Retailers Association (AIFMRA), the Delhi High Court on Thursday asked the government not to pick and choose but probe all 21 e-commerce websites